ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో జగపతిబాబు. ప్రస్తుతం జగపతిబాబు విలన్ గా మరియు ఇతర పాత్రలు చేస్తూ అదరగొడుతున్నాడు. జగపతిబాబు ఒకప్పుడు వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా మళ్ళీ హీరోగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతేకాకుండా లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Advertisement
అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “దాదాపు నేను రూ.1000 కోట్ల వరకు సంపాదించాను. అదంతా పోగొట్టుకున్నాను. జూదం వలన ఆస్తులు పోయాయి అనుకుంటారు. అది నిజం కాదు. కాసినోల్లో జూదం నేను సరదాకే ఆడతాను. డబ్బులు దాచడం నాకు తెలియదు. కొందరు బ్రోకర్స్ కూడా మోసం చేశారు. మొత్తంగా నా ఆస్తి పోవడానికి పూర్తి బాధ్యత నాదే” అని చెప్పుకొచ్చారు.
Advertisement
“నాకు తెలిసింది సినిమానే. 30 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. సాహసం అనే మూవీలో సెట్స్ లో నాకు జరిగిన అవమానం ఎప్పటికీ గుర్తుంపోతుంది. వారం రోజులు నాకు అన్నం పెట్టలేదు. కనీసం తింటావా అని అడగలేదు. ఆ మూవీకి పనిచేసిన లైట్ బాయ్ కూడా నా వద్దకు వచ్చి ఏడ్చాడు. వీడు ఎక్కడికి పోతాడులే సినిమాల్లోనే నటిస్తాడని అవమానించేవారు.
ఇతర భాషల్లో నటించి వస్తే మనోళ్లు గౌరవిస్తారు, అని వాపోయారు. 1992లో సాహసం విడుదల కాగా భానుచందర్ మరో హిరో. భాషా ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకుడిగా ఉన్నారు” అని తెలిపారు. ఇక కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి అమెరికన్ ను వివాహం చేసుకుంది. చిన్నమ్మాయికి మ్యారేజ్ వద్దన్నాను. కావాలంటే నువ్వే వెతికి చేసుకో అన్నాను. పార్ట్నర్ ని ఎంచుకునే విషయంలో వాళ్ళను మనం నియంత్రించకూడదు, అని జగపతిబాబు అన్నారు.
READ ALSO : విజయనిర్మల-కృష్ణ పెళ్లి జరుగుతుందని ముందే జోష్యం చెప్పిన ఆ స్టార్ నటుడు!