తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అసలు సూత్రధారి, పాత్ర దారి చంద్రబాబు నాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. స్కామ్ లు జైల్లో కాకుండా ఎక్కడ ఉంచాలని ప్రశ్నించారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు.
3,57,844 మంది కాపు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.536.77 కోట్లు జమ చేశారు సీఎం జగన్. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ…’ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టు అయిన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను. ఎన్ని దొంగతనాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు.
Advertisement
Advertisement
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియోతో అడ్డంగా దొరికిన పత్రికలు, టీవీల్లో నిజాలను చూపించరు. ఆ పని సబబేనని సపోర్ట్ కూడా చేస్తారు’ అని విమర్శించారు. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అని.. కోర్టుల్లో గంటలపాటు వాదనలు జరిగిన తరువాతనే బాబు జైలుకు వెళ్లాడని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు..? అని నిలదీశారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబును రక్షించుకునేందుకు ఎల్లో దొంగల ముఠా యత్నాలు చేస్తున్నారని….మంజునాథన్ కమిషన్ పేరుతో గత ప్రభుత్వం కాపులను మోసం చేసిందని అగ్రహించారు సీఎం వైఎస్ జగన్.
ఇవి కూడా చదవండి
- MS Dhoni : సాధారణ ఫ్యాన్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
- పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !
- Virat Kohli : వాటర్ బాయ్’గా మారిన విరాట్ కోహ్లి..వీడియో వైరల్ !