ఏపీలోని ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమం లోనే వై నాట్ 175 విధానంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజల్లోనే ఉండేందుకు ఆసక్తి చెబుతున్నారు అందుకే దీనిలో భాగంగా సంక్షేమం సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు తాజాగా మరో పథకం నిధులని మహిళల ఖాతాలలో వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు దీనిలో భాగంగా జనవరి 1న పెన్షన్ పెంపు అమలుని ప్రారంభించారు.
Advertisement
Advertisement
దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 67 లక్షల మంది పెన్షన్లకి లబ్ధి చేకూరింది ఈ నెలలో 23వ తేదీన వైయస్సార్ ఆసరా పథకం ద్వారా నిధులని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దాదాపు 250 కోట్లని ఖర్చు చేసినట్లు తెలుస్తోంది చివరి విడతగా 6400 కోట్లు అందించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన వైయస్సార్ చేయూత పథకం నిధులను విడుదల చేయడానికి జగన్ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. దాదాపు 206 లక్షల మంది మహిళలకు పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఈ పథకం కింద ఇప్పటిదాకా 14129 కోట్లు అందించినట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!