బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాలిట ఓ ముద్దు శాపంగా మారింది. జాక్వెలిన్ ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా జాక్వలిన్ ముద్దు ఫోటోతో మరోసారి చిక్కుల్లో పడింది. వివరాల్లోకి వెళితే …. 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ తో జాక్వెలిన్ కు పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఈడీ ఆమెను విచారించింది. అయితే అతనితో, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ జాక్వెలిన్ అధికారులకు వెల్లడించింది.
కానీ తాజాగా సుకేష్ కు జాక్వెలిన్ క్లోజ్ గా ఓ ముద్దు పెడుతున్న ఓ ఫోటో బయటకు వచ్చింది. దాంతో మరోసారి జాక్వలిన్ ఫెర్నాండేజ్ చిక్కుల్లో పడింది. సుకేష్ చంద్ర శేఖర్ పై మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సురేంద్ర సింగ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేష్ చంద్ర శేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా సుకేష్ చంద్ర శేఖర్ ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత అతడు బెయిల్ పై విడుదల అవ్వగా ఏప్రిల్ -జూన్ మధ్యలో జాక్వలిన్ తో ఫోటో దిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా సుకేష్ చంద్ర శేఖర్ ను జాక్వలిన్ ఫెర్నాండెజ్ చెన్నైలో నాలుగుసార్లు కలిసినట్టు అధికారులు చెబుతున్నారు. సుకేష్ ను కలిసేందుకు ప్రైవేట్ జెట్ ను ఆమెకోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సెకండ్ వేవ్ తరవాత “అఖండ వేవ్”..భారీగా బుక్ అవుతున్న టికెట్స్..!
దాంతో జాక్వలిన్ ను మూడుసార్లు విచారణకు రావాలని అధికారులు కోరగా ఆమె హాజరు కాలేదు. కానీ ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు. ఇక జాక్వలిన్ తో పాటు బాలీవుడ్ నటి నోరా ఫతేహి కి కూడా ఈడీ నోటీసులు పంపింది. ఇది ఇలా ఉంటే శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది. ఇక టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పవన్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ నటించబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కోవడం తో కెరీర్ పై దెబ్బ పడే అవకాశం ఉంది.