జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్ లు జీవితంలో స్థిరపడ్డారు. ఈ కామెడీ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతే కాకుండా ఇతర షోలు ఈవెంట్ లు చేస్తూ జేబుల నిండా సంపాస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా గుర్తింపు వచ్చి కమెడియన్స్ లో ఆర్పీ కూడా ఒకరు. ఆర్పీ మొదట టీంలో సభ్యుడుగా చేరి ఆ తరవాత తన కామెడీ టైమింగ్ తో టీం లీడర్ గా ఎదిగాడు.
Advertisement
కానీ ఆ తరవాత జబర్దస్త్ నుండి బయటకు వచ్చి ఆ షో పైనే సంచలన ఆరోపణలు చేశాడు. ఇక్కడ తిండి అస్సలు భాగుండదని జైల్ లో ఫుడ్ చాలా బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి కామెంట్స్ ను ఆయన తోటి కమెడియన్స్ సైతం అంగీకరించలేదు. ఇక జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన ఆర్పీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. అంతే కాకుండా ఆర్పీ ఇప్పుడు హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు.
Advertisement
ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కిచెన్ ను హైదరాబాద్ లో ప్రారంభించాడు. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో ఆర్పీ మాట్లాడుతూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా ఫేమస్ అని చెప్పాడు. హైదరాబాద్ లో తన స్నేహితుడితో కలిసి 50 లక్షలతో బిజినెస్ ప్రారంభించానని చెప్పాడు.
అంతే కాకుండా హైదరాబాద్ లో మొత్తం 15 బ్రాంచిలను ప్రారంభిచే ఆలోచనలో ఉన్నామని చెప్పాడు. అంతే కాకుండా నెలకు టర్నోవర్ లక్షల్లో ఉందని చెప్పాడు. ఇక ఈ వ్యాపారంలో ఆర్పీ భార్య కూడా ఆయనకు సహకరిస్తోంది.జబర్దస్త్ కు దూరంగా ఉంటున్నప్పటికీ ఆర్పీ ఇతర ఈవీ షోలు మరియు ఈవెంట్ లలో నటిస్తున్నాడు.