తెలుగులో ఎక్కువమంది కమెడియన్ లను పరిచయం చేసిన షో జబర్దస్త్. ఈ షో ద్వారానే ప్రస్తుతం చాలా మంది కమెడియన్ లు బయటకు వచ్చారు. కేవలం మేల్ ఆర్టిస్ట్ లకు మాత్రమే కాకుండా లేడీ ఆర్టిస్ట్ లకు కూడా ఈ షో లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా చాలా మంది లేడీ కమెడియన్స్ కూడా పరిచయం అయ్యారు. అలా పరిచయం అయిన వారిలో కమెడియన్ పవిత్ర కూడా ఒకరు. పవిత్ర జబర్దస్త్ షో లో మొదట చంద్ర స్కిట్స్ లో మెరిసింది.
Advertisement
ఆ తరవాత తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం పవిత్ర పలు టీవీ షోలతో పాటూ సినిమాల్లోనూ నటిస్తోంది. కాగా తాజాగా పవిత్ర ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది. మొదట హైదరాబాద్ లోని ఓ పార్లర్ లో బ్యూటిషియన్ గా పనిచేశానని చెప్పింది.
Advertisement
ఆ తరవాత సొంతంగా పార్లర్ ను పెట్టుకున్నానని తెలిపింది. ఇక ఆ పార్లర్ లో గిరాకీ రాకపోవడంతో అమ్మేసి రీసెంట్ గా సొంత ఊర్లో ఇంటిని కొనుగోలు చేశానని వెల్లడించింది. అంతేకాకుండా తన తండ్రి మద్యానికి భానిస అవ్వడంతో అతడితో మాట్లాడటం మానేశానని చెప్పింది. తన తండ్రి భార్య పిల్లలను గాలికి వదిలేశాడని తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించిందని చెప్పింది. తండ్రి మరణించినప్పుడు సంతోషించానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పిన్ని సాయంతో ఇంటర్ వరకూ చదువుకున్నానని…అప్పట్లో తినడానికి తిండి కూడా ఉండేదని కాదని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరబాద్ లో సెలూన్ నడుపుతున్న సమయంలోనే జబర్దస్త్ ఆఫర్ వచ్చిందని వెల్లడించింది.