Ad
2013లో తెలుగులో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో గురించి పరిచయం అనవసరం. ఓ మాములు టీవీ షో గా ప్రారంభమైన ఈ జబర్దస్త్ సూపర్ హిట్ సాధించింది. దాంతో ప్రతిరోజు ప్రేక్షకులను పెంచుకుంటూ పోయిన ఈ షో ఎందరో కమెడియన్స్ ను తయారు చేసింది. అటువంటి జబర్దస్త్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది అనేది చాలా మంది అంటున్న మాట..!
మొదట నాగబాబు ఈ షో నుండి వెళ్లిపోయిన తర్వాత ఈ సమస్య ప్రారంభమైంది.ఎందుకంటే ఆయనను ఆనుసరిస్తూనే చాలా మంది జబర్దస్త్ ను వదిలేసి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ షోలో ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ తగ్గించి జడ్జీలకు, యాంకర్లకు తెగ పెంచేస్తున్నారు అని తెలుస్తుంది. నాగబాబు స్థానంలో వచ్చిన సింగర్ మనోకి ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ.2 లక్షలు ఇస్తున్నారట.
అలాగే ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అనసూయ భరద్వాజ్ కు ఒక్కో ఎపిసోడ్‌కు అపట్లో 80 వేల వరకు అందుకుంటే.. ఇప్పుడు రూ.1.2 లక్షలు ఇస్తున్నారు. ఇక మరో యాంకర్ రష్మీ గౌతమ్ కి కూడా 1 నుండి ఏకంగా 5 లక్షలకు పెరిగిందనే పుకారు జోరుగా సాగుతోంది. కానీ ఈ షోలో పాపులర్ ఫిగర్ అయినా సుడిగాలి సుధీర్ ఇంతకుముందు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3.5 లక్షలు ఇస్తే… ఇప్పుడు అది రూ.3 లక్షలయూ వచ్చేసింది. ఇక హైపర్ ఆది కూడా తన పారితోషికం 3 నుండి 2.5 లక్షలకు తగ్గించినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
Advertisement