Home » Jabardasth Rohini: జగనన్న ప్రభుత్వంపై జబర్దస్త్ రోహిణి సెటైర్స్ ! ఆమె ఉద్దేశం ఇదేనా !

Jabardasth Rohini: జగనన్న ప్రభుత్వంపై జబర్దస్త్ రోహిణి సెటైర్స్ ! ఆమె ఉద్దేశం ఇదేనా !

by Anji
Published: Last Updated on
Ad

జబర్దస్త్ రోహిణి ప్రస్తుతం బుల్లితెరపై, వెండి తెరపై తనకు వచ్చిన అవకాశాలను బాగానే వాడుకుంటోంది. ఇటీవలే హనుమాన్ మూవీలో రోహిణి తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించింది. బిగ్ బాస్, సీరియల్స్ ఈవెంట్లు, బుల్లితెర షోలు అంటూ రోహిణి పుల్ బిజీగా ఉంటుంది. కొంచెం కష్టం సీరియల్ కి తనకు నంది అవార్డు ప్రకటించారట. కానీ ఇంత వరకు ఆ అవార్డును ఇవ్వలేదంటూ బాధ పడింది రోహిణి.

Jabardasth-Varshini

Advertisement

 

రోహిణి పోస్ట్ పై కొందరూ మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా..? ఇవన్నీ గుర్తుకొస్తాయని ఒకరు.. ఇంకా అవార్డు ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం పై రోహిణి కౌంటర్ వేసిందా..? అని మరొకరూ ఇలా ఎవ్వరికీ నచ్చినట్టుగా వారు కౌంటర్లు వేస్తున్నారు. అవార్డులు ముఖ్యం కాదు.. జాతీయ అవార్డులు తీసుకొని కూడా అవకాశాలు రాని వాళ్లు చాలా మంది ఉన్నారు. అభిమానుల ఆదరాభిమానులే ముఖ్యం అని మరికొందరూ పేర్కొంటున్నారు. నా ఫస్ట్ సీరియల్ కే నంది అవార్డు.. కానీ ఇంత వరకు రిసీవ్ చేసుకోలేదు. ఏది ఏమైనా ఇది నా జీవితంలో ఓ అందమైన మెమోరీ.

Advertisement

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం నేను ఎప్పుడో సాధించిన ఆ మెమోరినీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అంటూ రోహిణి వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2014 ఏడాదికి బెస్ట్ ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో ఈ సీరియల్ కి బెస్ట్ కమెడియన్ గా రోహిణి ఎంపికైనట్టు అందులో ఉంది. నంది అవార్డుతో పాటు రూ.10వేల క్యాష్ ప్రైజ్ వస్తుందని అందులో ఉంది. 2018లో ఈ లెటర్ రోహిణి వద్దకు చేరినట్టు కనిపిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నంది అవార్డు మీద అంతగా ఫోకస్ పెట్టడం లేదు. తాజాగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులు అని మార్చేసిన విషయం తెలిసిందే. కొందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. చిరంజీవి సమర్థించిన విషయం తెలిసిందే.

Also Read : తమిళ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన నటుడు ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading