Home » న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Bunty
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ప్ర‌స్తుతం వార్త‌ల లో ఎక్కువ గా వినిపిస్తుంది. ముఖ్యం గా ఇటీవ‌ల ముంబై ఎయిర్ పోర్ట్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదేశాలకు వెళ్తున్న క్ర‌మం లో ముంబాయి ఎయిర్ పోర్ట అధికారులు, ఈడీ అధికారులు అడ్డు కున్న నాటి నుంచి ఫెర్నాండెజ్ పేరు ఇంకా ఎక్కువ గా సోష‌ల్ మీడియా లో మార్మోగుతుంది. అయితే సుఖేష్ చంద్ర శేఖ‌ర్ అనే వ్య‌క్తి నుంచి 10 కోట్ల రూపాయల విలువైన బ‌హుమ‌తులు ఫెర్నాండెజ్ తీసుకుంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Advertisement

Advertisement

అంతే కాకుండా దీని పై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈ డీ నోటీసులు కూడా జారీ చేశారు. ఇది ఇలా ఉండ‌గా ప్ర‌స్తుతం హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి సోష‌ల్ మీడియా, గూగుల్ లో చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అందు లో భాగం గా ఆమె ఆస్తులు ఎంత ఉంటాయ‌నే ప్ర‌శ్న కూడా వారి నుంచి ఎక్కువ గా వ‌స్తుంది. ఇప్పుడు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. 2011 లో మ‌ర్డ‌ర్ 2 అనే సినిమా ద్వారా తొలి స‌క్సెస్ ను అందుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. త‌న వ‌రుస సినిమాలు, షోలు, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా చాలా నే సంపాదించింది.

ఈ శ్రీ లంక భామ ఆస్తులు దాదాపు రూ. 75 కోట్ల కు పైనే ఉన్నాయిని తెలుస్తుంది. అలాగే జాక్వెలిన్ ఫె ర్నాండెజ్ సంవ‌త్స‌ర ఆదాయం గా కూడా భారీ గానే ఉంద‌ని స‌మాచారం. ఫెర్నాండెజ్ ఏడాది కి దాదాపు గా రూ. 8 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తుంద‌ని స‌మాచారం. అంతే కాకుండా శ్రీ లంక లో సొంత దీవీ కూడా ఉంద‌ని తెలుస్తుంది.

Visitors Are Also Reading