కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ కోల్పోయిన లెజెండ్స్ లో ఏస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఒకరు. తెలుగుతో పాటూ తమిళ మలయాళ హిందీ భాషల్లో ఎస్పీ బాలు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఆయన కెరీర్ లో వందల కొద్ది సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలలోనూ ఎస్పీ బాలు పాటలు పాడారు. అయితే ఒకానొక సమయంలో బాలు ఆఫర్ లు లేక ఇబ్బంది పడ్డారట.
Advertisement
అలాంటి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పిలిచి ఛాన్స్ లు రావడంలేదని ఏమీ బాధపడవద్దు…నా సినిమాలు ఏడాదికి 7 విడుదలవుతున్నాయి అన్ని సినిమాలలోనూ మీరు పాడండి అంటూ బంపరాఫర్ ఇచ్చారు. అలా ఎస్పీ బాలు మొదటిసారి కృష్ణ హీరోగా నటించిన నేనంటే నేనే అనే సినిమాకు సాంగ్స్ పాడారు. ఈ సినిమా ఆల్బమ్ పెద్ద హిట్ అయ్యింది. ఆ తరవాత ప్రతి సినిమాలోనూ బాలూ పాటలు పాడేవారు.
Advertisement
కృష్ణకు బాలు గాత్రం చాలా బాగా సెట్ అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక వరుసగా కృష్ణ సినిమాలలో పాటలు పాడుతున్న బాలు సడెన్ గా మానేశారు. దానికి కారణం ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమే. ఓ నిర్మాత ఎస్పీ బాలు వద్ద సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తావణ తీసుకువచ్చారట. దాంతో ఎస్పీ బాలు ఒకటి మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఆ నిర్మాత కృష్ణ దగ్గర చెప్పారట.
దాంతో వెంటనే కృష్ణ ఎస్పీ బాలుకు ఫోన్ చేసి నా సినిమాలో నీ పాటలు లేకుండా హిట్ అవ్వలేవనుకుంటున్నావా..? అని ఫైర్ అయ్యారట. దాంతో ఎస్పీ బాలు మాట్లాడుతూ…నేను పాడకపోయినా వేరే వాళ్లు పాడినా మీ సినిమాలు హిట్ అవుతాయి. కానీ నా గాత్రానికి కూడా ఒక విలువ ఉంది. ఏదో ఒక సినిమాలో పాటలు పాడి నేను ఇండస్ట్రీలో నిలబడగలను అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారట. దాంతో వెంటనే కృష్ణ ఫోన్ కట్ చేశారట. అలా ఇద్దరి మధ్య జరిగిన చిన్న సంభాషణ మనస్పర్దలకు దారితీసింది. అయితే ఆ తరవాత ఓ సంగీత దర్శకుడు మళ్లీ ఇద్దరినీ కలపడంతో కృష్ణ సినిమాలకు బాలూనే పాడారు.