Home » చిరంజీవిపై విషం కక్కుతున్న అల్లు కుటుంబం…టార్గెట్‌ చేసి మరీ?

చిరంజీవిపై విషం కక్కుతున్న అల్లు కుటుంబం…టార్గెట్‌ చేసి మరీ?

by Bunty
Ad

చిరంజీవి, అల్లు అర్జున్ కుటుంబాలకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజుల నుంచి చిరంజీవికి, అల్లు అర్జున్ కి అస్సలు పడడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అల్లు కుటుంబం, మెగా కుటుంబం మధ్య గొడవలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో నిజం లేదని చాలాసార్లు ఇరు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా కుటుంబంలో వరుణ్ తేజ్, లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అల్లు కుటుంబం తరఫున అందరూ వివాహానికి హాజరయ్యారు. కానీ అల్లు అరవింద్ మాత్రం వివాహానికి రాలేదు.

Advertisement

దాంతో ఈ గొడవల్లో నిజం ఉందని మరో వార్త తెరపైకి వస్తోంది. అంతేకాకుండా అల్లు అరవింద్ చిరంజీవికి వ్యతిరేకంగా ఉన్న వారితోనే స్నేహం చేస్తున్నారట. చిరంజీవికి మద్దతు ఇచ్చే వారిని దూరం పెడుతున్నారట. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో ని చేయిస్తున్నారు. దానికి గల కారణం చిరంజీవికి, బాలకృష్ణకి ఎలాంటి గొడవలు లేకపోయినా…. సినిమా విషయంలో కాస్త మనస్పర్ధలు వచ్చాయట. దాంతో అరవింద్ బాలకృష్ణతో ఈ షోని చేపిస్తున్నారట. అంతేకాకుండా మోహన్ బాబుతో సైతం బిజినెస్ వ్యవహారాలను నడిపిస్తున్నారట అల్లు అరవింద్.

Advertisement

ఇలా చిరంజీవికి వ్యతిరేకంగా ఉన్నవారితోనే అల్లు అర్జున్ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని, వాటిని బయట పెట్టడం లేదని అనేక రకాల వార్తల వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చిరంజీవిపై అల్లు అరవింద్ ఎందుకు ఇంతలా విషం కక్కుతున్నారో తెలియడం లేదంటూ చిరంజీవి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి మాత్రం ఈ విషయాన్ని ఈ మాత్రం పట్టించుకోకుండా చాలా కూల్ గా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading