భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అందరికి తెలుసు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఆడటం వల్ల వీలుగులోకి వచ్చిన ఇషాన్ ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఆడిన భారత జట్టులో చోటు దకించుకున్నాడు. ఆ తర్వాత కూడా టీ ఇండియా తరపున మంచిగా ఆడిన ఇషాన్ ను ఈ ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో 15 కోట్ల భారీ ధరకు మళ్ళీ తీసుకోగా.. మొదటి ఆఖరి మ్యాచ్ లలో మాత్రమే రాణించాడు. అయిన కూడా బీసీసీఐ సెలక్టర్లు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిటీస్ కు అతన్ని ఎంపిక చేశాడు.
Advertisement
Advertisement
ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ లో తన ఎంపిక గురించి ఇషాన్ మాట్లాడుతూ.. మన ఇండియాకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వారు జట్టు కోడం ఎన్నో అద్భుతాలు చేసారు. అలాగే వారికీ చాలా అనుభవం ఉంది. అయిన కూడా వారిని జట్టు నుండి తప్పించి నన్ను ఓపెనర్ గా ఎంపిక చెయ్యండి అనే అంత ఆలోచన లేని వాడిని నేను కాదు. నా పని శక్తి మేర నేను చేయాల్సిందంతా చేయడం. సెలక్టర్లను మెప్పించడానికి ఎలాంటి ప్రదర్శనలు చేయాలో అలా ఆడుతాను అని ఇషాన్ అన్నాడు.
అయితే ఈ టీ20 సిరీస్ కు ఎంపిక చేసిన భరత జట్టును నవంబర్ లో జరగనున్న ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొనే ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ ఇందులో రోహిత్ శర్మను రెస్ట్ కారణంగా ఎంపిక చేయని సెలక్టర్లు… రాహుల్ ను గాయం కారణంగా తప్పించారు. అందుకే ఈ సిరీస్ లో ఓపెనర్ ఇషాన్ మంచి ప్రదర్శన చేస్తే అతనికి మళ్ళీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక అందుకు తగ్గట్లుగానే ఇషాన్ మొదటి టీ20 మ్యాచ్ లో అర్ధం శతకంతో రెచ్చిపోయాడు అనేది తెలిసిందే.