ప్రస్తుతం దేశంలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకరైన ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో ముఖేష్ అంబానీ మరోసారి తాతయ్యారు. ఈ సంతోష గట్టంతో ఓవైపు అంబానీ కుటుంబం, మరోవైపు ఫిరామల్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది.. అయితే వీరికి కవల పిల్లలు జన్మించినట్టు ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటన చేశాయి. 19 నవంబర్ 2022 ఇషా అంబానికి కవలలు జన్మించారని ఇందులో ఒకరు మగ శిశువు మరొక ఆడ శిశువు అని వెల్లడించాయి.
Advertisement
also read:ఇది 100% నిజం: అమ్మాయి మీతో మాట్లాడాలి అంటే 3 సంకేతాలు ఖచ్చితంగా ఇస్తుంది..!!
Advertisement
ఈషా అంబానీ భర్త పేరు ఆనంద్ ఫిరామల్. ఇక ఇషా అంబానీ తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ.. ఆనంద్ ఫిరమలు తల్లిదండ్రులు అజయ్ స్వాతి పిరామల్ కలిసి ఈ ప్రకటన చేశారు.. తల్లితో పాటు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు.. వీరు పుట్టిన వెంటనే వారికి పేర్లు కూడా పెట్టేశారు. ఈషా అంబానీ కుమారుడు పేరు కృష్ణా అని, కుమార్తె పేరు ఆదియ అని నామకరణం చేశారు. దేశం మొత్తం దీవించాలని, ఈ పసివాళ్ళ రాకతో మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని వారు అనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అంబానీ కుటుంబంతో పాటు పిరామల్ కుటుంబం కూడా దేశ వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఫిరామాల్ గ్రూప్ కూడా ఒకటి. ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కి, పిరామల్ గ్రూపు సంస్థల యజమాని అజయ్ పిరామల్ కుమారుడు ఆనంద్ ఫిరామాలకు ఇచ్చి అత్యంత అద్భుతంగా వివాహం చేశారు. వీరి పెళ్లి దేశంలోని అత్యంత ఖరీదైన పెళ్లిల జాబితాలో చేరింది.
దేశ విదేశాల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు పెళ్లికి తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవలే ముకేశ్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీకి రిలయన్స్ లో “రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా” కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాపారం మొత్తం ఆమెనే చూసుకుంటున్నారు.
also read:చిరంజీవిపై ప్రధాని ప్రశంసలు.. భావోద్వేగ ట్వీట్ చేసిన మెగాస్టార్..!