సాధారణంగా తెల్ల వెంట్రుకలు అంటే మన తాత వయసులో ఉన్న వారికి మనం చూస్తూ ఉంటాం. అంటే 60 నుంచి 70 ఏళ్ల పైకి వయసు ఉన్న వారికి తెల్ల వెంట్రుకలు రావడం సర్వసాధారణమే కావచ్చు. కానీ ప్రస్తుత కాలంలో కొంతమందికి 25 ఏళ్ల వయసు నుండే తెల్ల వెంట్రుకలు రావడం మొదలవుతుంది. దీనివల్ల చాలామంది అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్యతో ఆత్మస్థైర్యం కోల్పోయే యువత చాలామంది ఉన్నారు. సాధారణంగా మన వయసును చెప్పేది మన శిరోజాలే.
Advertisement
ఎంత వయసు వచ్చిన యవ్వనంగా ఉండాలని కోరిక ఎవరికైనా ఉంటుంది. అయితే యుక్త వయసులోనే శిరోజాలు రంగును కోల్పోవడం అనేది తప్పనిసరిగా గమనించాల్సిన విషయం. అయితే దీని వెనుక కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, అలాగే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం, పోషకాహారం తినకపోవడం, వంటివి కారణాలు కావచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాబట్టి జుట్టు తెల్ల పడకుండా బ్లాక్ గా ఉండాలంటే కొన్ని మార్పులు తప్పనిసరిగా వారు తెలియజేస్తున్నారు. మరి ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసిన శ్రీజ… నెట్టింట వైరల్….,!
ఎండిన ఉసిరికాయలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఈ లిక్విడ్ వెంట్రుకలకు రాసుకోవాలి.
కుంకుడు, షీకాకాయలను నాన బెట్టి, తర్వాత ఉడకబెట్టాలి. ఈ లిక్విడ్ ను షాంపూగా ఉపయోగించాలి.
ఒత్తిడి జుట్టు రంగు నెరవడానికి దారితీస్తుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రాణాయామం, యోగా చేయాలి. లేదంటే హోమియోపతి, అల్లోపతి ఔషధాలు తీసుకోవాలి.
కూరగాయలను ఎక్కువగా తినాలి.
రోజు కనీసం రెండు రకాల పండ్లు తీసుకోవాలి. లేదంటే రసం చేసుకుని తాగాలి.
గుడ్లు, చికెన్, పప్పులను ఆహారంలో భాగంగా చెసుకోవాలి.
also read: