ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించిన మూవీ కాంతారా. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీనికి కూడా రిషబ్ శెట్టి రచనా, దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం. కాంతారా మూవీ సెప్టెంబర్ 30న థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 500 కోట్లను వసూలు చేసింది. ఈ తరుణంలోనే హోమ్ బోలే ఫిలిం బ్యానర్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కిరగంందూర్ మాట్లాడుతూ కాంతారా సినిమా హిట్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని త్వరలోనే కాంతారా 2 కూడా నిర్మిస్తామని ఆయన అన్నారు.
Advertisement
also read:టాప్ 2లో టీమిండియా… ఆ ఒక్క సిరీస్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి! ఈసారి ఆస్ట్రేలియాతో…
Advertisement
ప్రస్తుతం రిషబ్ శెట్టి విరామంలో ఉన్నాడని, దీనికోసం కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. కాంతారా2 లో కూడా ఆచారాలు, నమ్మకాలు అనే బేస్ లోనే కాంతారా 1 కంటే ఎక్కువ మెప్పించగల బలమైన కథతో మళ్లీ ముందుకు వస్తామని ఆయన అంటున్నారు. రిషబ్ శెట్టి ఈ మూవీ తీసే సమయంలో ఎలాంటి ప్లానింగ్స్ లేవని, అనుకోకుండానే ఆ కథను ఎంచుకొని సరికొత్తగా రూపొందించారని, సినిమా జనాలను అంత కనెక్ట్ అవుతుందని అనుకోలేదని ఆయన అన్నారు.
అయితే కాంతారాలో శివ తండ్రి గురించి పెద్దగా చెప్పలేదు. కానీ కాంతారా2లో శివ తండ్రి భూతకోల నర్తకిగా మారే ఆధ్యాత్మిక పాత్రపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఆస్కార్ కోసం కాంతారా మూవీ దరఖాస్తు చేశామని అన్నారు. ఈ చిత్రం కథ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని , కాంతారా 2 కూడా అదే లెవెల్లో రాబోతున్నట్టు వెల్లడించారు విజయ్ కిరగందూర్.
also read: