రియల్ స్టార్ శ్రీహరి హీరోగా 2007లో తెరకెక్కిన మహాలక్ష్మి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది పూర్ణ. ఇక అల్లరి నరేష్‌తో కలిసి సీమటపాకాయ్ సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. అనంతరం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును, అవును-2 సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆ తరువాత లడ్డుబాబు, మామ మంచు అల్లుడు కంచు, సిల్లీ ఫెల్లోస్, నువ్వలా నేనిలా, అవంతిక, పవర్ ప్లే లాంటి సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పవచ్చు.
Advertisement
గత కొంత కాలంగా హీరోయిన్గా క్రేజ్ తగ్గడంతో 33 ఏళ్ల పూర్ణ కొన్ని కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. దృశ్యం 2, తలైవి, అఖండ సినిమాలలో నటించారు. మరొకవైపు టీవీ షో లలోనూ పూర్ణ మెరుస్తున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ.. చాలా ఫేమస్ అయ్యారు. ప్రియమణి, విజయ్ మాస్టర్ తో కలిసి మూడవ జడ్జీగా ఉన్నారు. స్వతహాగానే డ్యాన్సర్ అయిన పూర్ణ అప్పుడప్పుడు స్టేజీ మీద డాన్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Advertisement
ఇక కేరళ కుట్టి ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరొవైపు పలు టీవీ షైఓలకు జడ్జీగా వ్యవహరిస్తున్నది. ఢీ కార్యక్రమానికి కొన్నాళ్ల పాటు జడ్జీగా వ్యవహరించిన ఈమె.. ఆ తరువాత ఆ షో నుండి తప్పుకున్నది. ఆ షో నుంచి ఎందుకు తప్పుకున్నదనే విషయాన్ని ఇన్నాళ్లకు ఆమె వెల్లడించింది. కౌగిలింతలు ఇవ్వలేక ఆ షో నుంచి నుంచి తప్పుకున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేసింది పూర్ణ. ఇక ఆ షోలో డ్యాన్స్ బాగా చేశారంటూ.. డ్యాన్సర్లకు హగ్స్ ఇవ్వాలని.. వారితో పాటు డ్యాన్స్ మాస్టర్లకు యాంకర్లకు కూడా కౌగిలింతలు ఇవ్వాలని చెప్పింది. ఇక పని చేయడం ఇష్టం లేకనే షో నుండి తప్పుకున్నానని తెలిపింది.యూఏఈలో ఉండే షానిద్ అసిఫ్‌ను త్వరలోనే పెళ్లాడబోతుందట. ఇటీవలే సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్తను అభిమానులకు ఆమె పరిచయం చేసింది.
Also Read :
కథ నచ్చినా “జోష్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..5 కారణాలు ఇవేనా..!
హీరోగా నటించాల్సిన డీఎస్పీ ఎందుకు డ్రాప్ అయ్యాడు…ఎవరు వద్దన్నారో తెలుసా…!