తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈమె ఎన్నో చిత్రాలు చేసి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చి నటించింది. ఆ సమయంలో ఈమె డేట్స్ కోసం హీరోలు మరియు దర్శకనిర్మాతలు కూడా వెయిట్ చేసే వారు అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నటి నిజ జీవితంలో అనేక ఇబ్బందులు పడి తన చివరి రోజుల్లో చాలా దారుణంగా మరణించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సావిత్రి ఏ రోజు ఒక్క అవార్డును కూడా స్వీకరించలేదు. పద్మశ్రీ, దాదాసాహెబ్ పాల్కె అవార్డులు కూడా ఈమెను వరించలేదు.
Advertisement
అలాగే రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా నోచుకోలేదు అంటే ఈమె గుణం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోని అద్భుతమైన నటుడుగా పేరు పొందిన నందమూరి తారక రామారావు ఆమె గురించి మాట్లాడుతూ సావిత్రి నటించడం అంటే ఒక గొప్ప అనుభవం, ఆమెతో నటించాలంటే ఒక్కోసారి భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేవారు. ఈయనే కాకుండా ఎస్వీరంగారావు, శివాజీ గణేషన్ లాంటి వారే సావిత్రితో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారని తెలుస్తోంది. ఆమె పోయేటప్పుడు చివరికి మహానటి అనే బిరుదు తప్ప ఏది కూడా శాశ్వతంగా తీసుకుపోలేదు. ఇకపోతే 1965 ఉత్తమ తెలుగు సినిమా గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న “చివరకు మిగిలేది” అనే మూవీలో నటించింది.
Advertisement
ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న సావిత్రి తను చనిపోయే ముందు ఒక చివరి కోరిక చెప్పిందట. అదేంటి అంటే నా సమాధి పై నిలిపే సంస్మరణ పలకలమీద ఈ వ్యాఖ్యలు రాయాలని చెప్పిందట..” జీవితంలోనూ.. మరణంలోనూ.. మహోన్నత మైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతి పొందుతున్నది.. ఎవరూ కూడా ఇక్కడ సానుభూతితో వేడి కన్నీటి బోట్లను విడవనక్కరలేదు.. ఇక సమాజంలో ఏ తారను కూడా హీనంగా చూడకుండా, సమాధిలో నిద్రిస్తున్న మరణం లేని మహా ప్రతిభకు చిహ్నంగా పూలను ఉంచండి. ఇదే మీరిచ్చే గౌరవం” అని సావిత్రి అన్నారట.. ఆమె మాటలను ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
also read;
సిమ్రాన్ చెల్లెలిని లవ్ పేరుతో ఆ పని కానిచ్చేసి..మోసం చేసిన డాన్స్ మాస్టర్..!!
ఆ స్టార్ డైరెక్టర్ సె**వీడియోలు చూడాలంటూ ఇబ్బంది పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..!!