Telugu News » Blog » ఆ స్టార్ డైరెక్టర్ సె**వీడియోలు చూడాలంటూ ఇబ్బంది పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..!!

ఆ స్టార్ డైరెక్టర్ సె**వీడియోలు చూడాలంటూ ఇబ్బంది పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో ఇండస్ట్రీలో తనదైన నటనతో ఒక ఊపు ఊపేస్తోంది.. ఒకప్పుడు ఇండస్ట్రీలో తన సొగసైన అందచందాలతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఆ స్టార్ డైరెక్టర్ నన్ను ఆ వీడియోలు చూడాలని ఇబ్బంది పెట్టేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది రమ్యకృష్ణ.. అయితే చివరికి ఆమె ఏం చేసిందో అసలు విషయం తెలుసుకుందాం.. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ వల్ల ఎంతో మంది హీరోయిన్స్ ఇబ్బందులు పడిన విషయం అందరికి తెలిసిందే. గతంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి చాలామంది హీరోయిన్స్ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఒక డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేసింది. కానీ ఆ స్టార్ డైరెక్టర్ చివరిదశలో నరకం అనుభవిస్తూ చనిపోయారట. తన అందంతో నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రమ్యకృష్ణ, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అదరగొడుతోంది. ప్రస్తుతం సీనియర్ రోల్స్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తోంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న లైగర్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించిందని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో తన అందం,అభినయంతో మంత్రముగ్ధుల్ని చేసింది రమ్యకృష్ణ. కొన్ని సంవత్సరాల పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో చక్రం తిప్పింది. ఇండస్ట్రీ ఏదైనా తన నటనతో పిచ్చెక్కించేది.

తన కెరియర్ మొదట్లో అందరిలాగానే రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంది. అవకాశాల పేరుతో చాలామంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడానికి ట్రై చేశారట. ఒక స్టార్ డైరెక్టర్ ఆమెకు ఆ బూతు వీడియోలు చూపించాలని ట్రై చేసి, చాలా ఇబ్బందులు పెట్టేవారట. వయసులో చాలా పెద్దాయన పైగా ఇండస్ట్రీలో ఒక టాప్ ప్లేస్ లో ఉండటంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పినా నమ్మలేదని, చాలా వల్గర్ కామెంట్స్ తో అసభ్యంగా ప్రవర్తించారని రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే కొన్నేళ్ల తర్వాత ఆయన చాలా దారుణంగా చనిపోయారని, నా అన్న వాళ్లు కూడా ఆయనను చూడడానికి రాలేదని, తిండి తిప్పలు లేక అనాధగా నరకం అనుభవించి చనిపోయారని ఆమె అన్నది.

also read:


You may also like