టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత చిన్న వయస్సు కలిగిన హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. ఈమె ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ అమ్ముడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీలో కాస్త డల్ అయిపోయింది ఈ బ్యూటి. ఈ తరుణంలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో నటించి మళ్లీ హిట్ బాట పట్టింది. ఈ సినిమాల తరువాత ఆమె నటించినటువంటి చాలా సినిమాలు సక్సెస్ సాధించలేకపోయాయి.
Advertisement
వరుసగా ఫ్లాప్స్ రావడంతో కృతిశెట్టికి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. కృతిశెట్టి టాలీవుడ్ లో హిట్ సినిమాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ సూర్య, కార్తి వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వస్తోంది. కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది కృతి. ఈ నేపథ్యంలోనే ఈమెకు ఓ స్టార్ హీరో కుమారుడి నుంచి సమస్యలు ఎదురవుతున్నాయట.
Advertisement
కృతిశెట్టితో ఆయన ఎలాగైనా ఫ్రెండ్ షిప్ చేయాలని చూస్తుంటే.. ఈమెకు మాత్రం అస్సలు ఇష్టం లేదట. కృతి ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె వెంటే వెళ్తూ విసిగిస్తున్నాడట. ఇటీవల ఆ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టిని షూటింగ్ వదులుకొని రావాలని మరీ చెప్పాడట. నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానని.. నా పుట్టిన రోజుకి రావాలంటూ ఫోన్ చేశాడట. అలా ప్రతీరోజు తనతో ఉండాలని ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నాడని కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం కృతిశెట్టి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాకి నష్టాలు వచ్చాయనే విషయం మీకు తెలుసా ?
ఆ స్టార్ హీరోతో సినిమా ప్రారంభించిన వేణు మాధవ్ మధ్యలో వదిలేయడానికి కారణం ఏమిటి?