నందమూరి నట సార్వబౌముడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో సీనియర్ ఎన్టీఆర్. ఒకప్పుడు ఎన్టీయార్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యం గా పౌరాణిక సినిమాలను చేయడంలో ఆయనను మించిన నటుడు మరొకరు లేరనే చెప్పాలి.
Advertisement
ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి హరికృష్ణ, బాలకృష్ణ లు ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇక మూడో తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధ్యత మొత్తం తనే మోస్తున్నాడు. అయితే తను స్టార్ హీరో గా మారడానికి తనకు జరిగిన అవమానమే కారణమట. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పెళ్లికి హరికృష్ణ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ శాలిని ని ఆహ్వానించాడు. దీంతో వాళ్లు పెళ్లికి వచ్చారు ఇక అప్పుడే అక్కడికి చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు రావడంతో సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో వీళ్ళను పెళ్లి కి ఎందుకు పిలిచావు ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు.
Advertisement
ఇలాంటి సమయంలో వీళ్లను పిలవడం కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ స్వయంగా హరికృష్ణ మీద అరిచాడట. ఇక హరి కృష్ణ వీళ్లని రిటర్న్ ఆటోలో ఎక్కించి ఫంక్షన్ నుంచి ఇంటికి పంపించేశాడట. ఎన్టీఆర్ కి.. వాళ్ళ అమ్మకి అది తీవ్ర అవమానంగా అనిపించిందట. ఇక ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ అప్పుడు ఎన్టీఆర్ ని ఎలాగైనా స్టార్ హీరోని చేయాలనే ఉద్దేశ్యంతో డాన్స్ , యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయించింది. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.. అలా అప్పుడు జరిగిన అవమానం వల్లనే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీలో నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
Also Read : పవన్ మూడో భార్య విడాకుల గురించి వేణు స్వామి ఏం చెప్పారో తెలుసా ?