సాధారణంగా మానవులకు ఏర్పడే శరీర సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య చాలా జటిలమైనది.. ఈ సమస్య ఇండియాలో చాలామంది ఎదుర్కొంటున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో ఈ గ్యాస్ సమస్య వల్ల ఆపాన వాయువు ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల రాత్రి కూడా నిద్ర సరిగా పట్టదు. దీంతో కడుపులో మంటగా ఉండటం ఇతర జీర్ణ సమస్యలు ఏర్పడి గ్యాస్ పెరిగిపోవడం వంటివి జరుగుతాయి.. మరి ఇలా ఎందుకు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read:పాన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా ?
Advertisement
కొంతమందికి రాత్రిపూట చాలా ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువగా ఏర్పడుతుంది. కామన్ గా రాత్రిపూట పార్టీలు, విందులకు బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలోనే సమస్య ఎక్కువవుతుంది. అయితే పార్టీలకు వెళ్ళినప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు. సాధారణంగా ఆహారం జీర్ణం కావడానికి 6 గంటల సమయం పడుతుంది..
కాబట్టి సాయంత్రం పూట ఎక్కువగా నూనెతో చేసిన స్నాక్స్ తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కడుపు ఉబ్బడం వంటివి ఏర్పడతాయి. కాబట్టి రాత్రిపూట తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవ్వడమే కాకుండా గ్యాస్ వంటి సమస్యలు ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..
also read: