Home » నాగచైతన్య,అఖిల్ రేంజ్ లో సుశాంత్ సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా ?

నాగచైతన్య,అఖిల్ రేంజ్ లో సుశాంత్ సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా ?

by Anji
Ad

అక్కినేని వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సుశాంత్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఆ సినిమాలు ఆశించిన మేరకు ఆకట్టుకోకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా కొనసాగుతున్నారు సుశాంత్. పెద్ద హీరోల సినిమాల్లో ప్రాధాన్యత లేని పాత్రల్లో సుశాంత్ నటించడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Also Read : రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పుడేనా?

Advertisement

అక్కినేని నాగసుశీల కుమారుడు అయినటువంటి సుశాంత్ 2008లో కాళిదాస్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కరెంట్ సినిమాతో కొంచెం సక్సెస్ నే సాధించారు.  చిలసౌ సినిమాతో సక్సెస్ సాధించినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు. అల వైకుంఠపురంలో సినిమాలో మంచి రోల్ దక్కినా ఆ పాత్ర వల్ల సుశాంత్ కెరీర్ కి పెద్దగా ప్రయోజనం కలుగలేదు. నాగచైతన్య, అఖిల్ స్థాయిలో మార్కెట్ ను సొంతం చేసుకోవడంలో సుశాంత్ ఫెయిల్ అయ్యారు.  

Advertisement

Also Read :  సమంత పోస్ట్ కి రిప్లై ఇచ్చిన అఖిల్.. ఏమన్నాడంటే ? 

నాగార్జున సుశాంత్ కెరీర్ పై ప్రారంభంలో ఫోకస్ పెట్టినప్పటికీ ఆ తరువాత తన కొడుకులపై దృష్టి సారించి సుశాంత్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. క్రేజ్ దర్శకులు ఎవ్వరూ సుశాంత్ సినిమాలకు దర్శకత్వం వహించకపోవడంతో మైనస్ అయింది. నాగార్జున స్పెషల్ ఫోకస్ పెడితే సుశాంత్ కెరీర్ మరోలా ఉండేది. అభిమానుల్లో ఆశించినంత గుర్తింపు సంపాదించుకున్నా సుశాంత్ మాత్రం కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశారని భావిస్తున్నారు. సుశాంత్ ఇప్పుడు అక్కినేని హీరోల సినిమాల్లో కనిపించకపోవడం గురించి కూడా చర్చించుకుంటున్నారు. కెరీర్ పరంగా సుశాంత్ కి మరిన్ని విజయాలు దక్కాలని భావిస్తున్నారు అభిమానులు. రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో సుశాంత్ నటించాడు. ఈ చిత్రం భిన్నమైన టాక్ తెచ్చుకుంది.  

Also Read :  అమ్మాయి కాదు, అబ్బాయే! ది కేర‌ళ స్టోరి!

Visitors Are Also Reading