ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరిస్ పాల్గొంటుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య జట్టు సారథి లిట్టన్ దాస్ టాస్ గెలిచాడు. వెంటనే బౌలింగ్ ని ఎంచుకొని తన సేనతో మైదానంలోకి దిగాడు. టాస్ అయిపోయి, బంగ్లాటీమ్ మైదానంలోకి ప్రవేశించే ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. గాయాల కారణంగా రిషబ్ పంత్ ని టీమ్ లోకి తీసుకోలేకపోతున్నామని వెల్లడించారు.
Advertisement
అతనికి బదులుగా యువ ఆటగాడు కుల్దీప్ సేన్ ని జట్టులోకి తీసుకుంటున్నట్టు వివరించాడు. అయితే కుల్దీప్ సేన్ ఈ రోజే తన వన్డే ఫార్మాట్ ఆరంగేట్రం చేశాడు. టాస్ ప్రక్రియ తరువాత మైదానంలోకి దిగిన బంగ్లా టీమ్ తమ బౌలింగ్ తో భారత ఆటగాళ్లను కట్టడి చేయగలిగారు. 41.2 ఓవర్లలో భారత జట్టు కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. గాయాల కారణంగా సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేకపోవడంతో నలుగురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగినట్టు రోహిత్ చెప్పుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షెహ్ బాజ్ అహ్మద్, దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారు.
Advertisement
Also Read : FIFA World Cup 2022 : క్వార్టర్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్..!
కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్ తో ఆరంగేట్రం చేస్తున్నాడు. గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలోనే నలుగురు ఆల్ రౌండర్లను తీసుకున్నాం అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా వెల్లడించారు. అయితే ప్రధానంగా రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి వైద్యుల సూచనల మేరకు జట్టులో నుచి అతడిని తప్పించామని.. టెస్ట్ మ్యాచ్ లకు అతను అందుబాటులో ఉంటాడు అని బీసీసీఐ ఓ ట్వీట్ చేయడం విశేషం.
Also Read : ఈ 4గురు ఫుట్ బాల్ ప్లేయర్ల పారితోషకం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం..!!