పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కాని ప్రస్తుత కాలంలో చాలామంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ మిస్సై పెళ్లంటే నూరేళ్ల మంటాలా భావిస్తున్నారు. పెళ్ళై మూన్నాళ్లయినా కాకముందే విడాకుల బాట పడుతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? భార్యాభర్తల మధ్య గొడవలకు కారణాలేంటో తెలుసుకుందాం.. సాధారణంగా భార్యాభర్తలు అంటే పోట్లాడుకోవాలి. అది సరదాగా పోట్లాడుకోవాలి కోపంగా పోట్లాడు కోవాలి. కానీ వాటిని సీరియస్ గా తీసుకోకూడదు. అలా సరదాగా పోట్లాడుకొని మళ్లీ కలిసిపోతే ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. కానీ చాలామంది ఆర్టిఫిషియల్ గా ఓకే అండి, ఓకేనే.. ఓకే.. ఓకే అంటూ మాట్లాడుతూ ఉన్నారంటే అందులో ఏదో ఒకటి వారి మధ్య ఉన్నట్టే అర్థం.. అలాగే భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా దాపరికాలు ఉండకూడదు.
Advertisement
అవి ఎలాంటి విషయాలైన షేర్ చేసుకుంటేనే మీ భార్య భర్తలు బాగా ఉన్నారని అర్థం. కాని ప్రస్తుత కాలంలో చాలా మంది భర్తలు ఆఫీస్ పనుల బిజీ వల్లనో, లేదంటే ఇతరాత్ర ఒత్తిళ్ల వల్లనో ఊరికే భార్యలపై విసుక్కుంటూ ఉంటారు. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్తల పై ఊరికే అనుమాన పడుతూ గొడవలకు దిగుతుంటారు.. ఇలాంటి విషయాలలో భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా మెయింటెయిన్ చేస్తే వీటిని రెక్టిఫై చేసుకోవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. కొంతమంది ఇళ్లలో ఫోన్ మాట్లాడేటప్పుడు చాటుకు వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అది భార్య అయినా భర్త అయినా అలా మాట్లాడితే అనుమానాలు పెరుగుతాయి..
Advertisement
అయితే మీరు మాట్లాడేది ఎదుటి వారికి తప్పకుండా అర్థం అవుతుంది కాబట్టి, ఆఫీస్ వారితో మాట్లాడినా చక్కగా ఇంట్లో కూర్చొని భార్యకు లేదా భర్తకు అర్థమయ్యే విధంగా మాట్లాడితే అలాంటి అనుమానాలకు,దాపరికాలు తావు ఉండదని నిపుణులు అంటున్నారు. ఏదైనా పర్సనల్ కాల్ ఆఫీస్ నుండి మాట్లాడాలి అంటే భార్యకు లేదా భర్తకు అర్థమయ్యే విధంగా చెప్పి సైడ్ కి వెళ్లి మాట్లాడాలి తప్ప నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అనే ప్రస్తావన చేస్తే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ మిస్ అవుతుందని, ఒక ఫోన్ విషయమే కాదు, ఇలా అనుమానాలకు తావు తీసే ప్రతి విషయాన్ని ఇద్దరు అనుకుని షేర్ చేసుకుంటే వారి బాండింగ్ బాగుంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య దాపరికాలు అనేది ఉండకూడదని అంటున్నారు నిపుణులు.
ALSO READ;