టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. తన నటనతో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారనే విషయం తెలిసిందే. ఇక నాగార్జున నటించిన బంగార్రాజు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫలితం విషయంలో పూర్తిగా కాన్ఫిడెన్స్ తో నే ఉన్నారు నాగ్. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisement
సీనియర్ ఎన్టీఆర్ కారణంగా నాగార్జునకి జాతీయ అవార్డు మిస్ అయినట్టు సమాచారం. అయితే నాగార్జున హీరోగా నటించిన సంకీర్తన సినిమాకు జాతీయ అవార్డు రావాల్సి ఉందని.. అయితే సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న కోపం వల్ల కేంద్రం కొద్ది రోజుల పాటు జాతీయ అవార్డులను ఆపేసిందని ప్రముక దర్శకుడు గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగుకి ఇవ్వాల్సిన అవార్డును సైతం ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అనే కారణంతోనే ఇవ్వలేదని చెప్పుకొచ్చారు గీతాకృష్ణ.
Advertisement
నాగార్జునకు ప్రతీ సినిమాకు క్రేజ్ పెరుగుతుండగా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథల్లో నాగార్జున నటిస్తున్నారు. కుర్ర హీరోలకు నాగార్జున గట్టి పోటీనే ఇస్తున్నారు. 60 ఏళ్ల వయస్సులో కూడా నాగార్జున యంగ్ హీరోలాగానే కనిపిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు నాగార్జునతో కలిసి నటించాలని ఆశపడుతున్నారు. నాగార్జున రెమ్యునరేషన్ కూడా రూ.10కోట్ల వరకు ఉందని సమాచారం. తన నటనతో పలు అవార్డులను గెలుచుకున్నారు నాగార్జున. ఊహించని స్థాయిలో ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకుల్లో సైతం నాగార్జున కొన్ని విషయాల్లో గ్రేట్ అనడం, ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలను ఇప్పించారని అభిమానులు చెబుతుంటారు. ఏదీ ఏమైనప్పటికీ నాగార్జునకి జాతీయ అవార్డు రాకపోవడానికి ఎన్టీఆర్ కారణమనే చెప్పవచ్చు.
Also Read :
సుధీర్ ను మోసం చేసిన గెటప్ శ్రీను..!
అభిమానులకు షాక్ ఇచ్చిన నిత్యామీనన్.. యాక్టింగ్ కి బ్రేక్..!