Home » సుధీర్ ను మోసం చేసిన గెటప్ శ్రీను..!

సుధీర్ ను మోసం చేసిన గెటప్ శ్రీను..!

by Azhar
Ad

జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతో మందికి గుర్తింపు అనేది ఇచ్చింది. అలాగే చాలా మంది నటులను టాలీవుడ్ కిపరిచయం చేసింది. అలాగే ఈ షో ద్వారా ఎంతో మంది మంచి స్నేహితులుగా కూడా మారారు. అయితే ఇందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను అలాగే ఆటో రామ్ ప్రసాద్ మంచి మిత్రులు అనే విషయం అందరికి తెలుసు. అయితే సుధీర్ అలాగే శ్రీను జబర్దస్త్ కంటే స్నేహితులు. ఇక ఈ ముగ్గురు కలిసి చేసే స్కిట్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరి టీంను ఎంతో మంది అభిమానించేవారు. అలాగే వీరు విడిపోకుండా ఎప్పటికి ఇలానే ఉండాలి అని కామెంట్స్ చేసేవారు.

Advertisement

కానీ అభిమానులు అనుకున్న విధంగా జరగలేదు. కొన్ని నెలల క్రితం సుధీర్ అలాగే శ్రీను ఇద్దరు జబర్దస్త్ ను వదిలేసి వెళ్లిపోయారు. కానీ రామ్ ప్రసాద్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. అయితే ఇందులో శ్రీను సినిమాల్లో చాలా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కు సమయం లేక ఇందులోనుండి వెళ్ళిపోయాడు. కానీ సుధీర్ మాత్రం వేరే షోలో అవకాశం రావడం వల్ల జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడు. కానీ ఇప్పుడు తెలుస్తున్న తాజాగా విషయం ఏమిటంటే.. శ్రీను సుధీర్ ను మోసం చేసాడు అని సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

అందుకు కారణం.. తాజాగా శ్రీను మళ్ళీ జబర్దస్త్ కు తిరిగి వచ్చాడు. అయితే మొదట శ్రీను వెళ్ళిపోతాను అని చెప్పడం వల్లే నేను కూడా వెళ్ళిపోతాను అని సుధీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కానీ శ్రీను బయట వేరే షోలు చేయకుండా మళ్ళీ వెన్నకి జబర్దస్త్ కు వచ్చాడు. కానీ సుధీర్ మాత్రం అక్కడ వేరే షోలో చేరిపోయాడు. అయితే బయటకి వెళ్లిన వారు జబర్దస్త్ కు రావచ్చు.. కానీ వేరే షోకి వెళ్ళితే మాత్రం మళ్ళీ జబర్దస్త్ కు రాలేరు. ఆ కారణంగా మళ్ళీ సుధీర్ జబర్దస్త్ కు రాకుండా అయిపోయాడు. అందువల్లే ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

నేను ఇలా ఎదగడానికి ఆ ఎడిటర్ కారణం..!

మళ్ళీ బ్యాట్ పట్టనున్న మిథాలీ… రిటైర్మెంట్ బ్యాక్…?

Visitors Are Also Reading