టాలీవుడ్ లో విడాకుల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. నాగచైతన్య సమంత విడాకుల ను ప్రేక్షకులు జీర్ణించుకోక ముందే పలువురు సెలబ్రిటీలు విడిపోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సింగర్స్ శ్రావణ భార్గవి తన భర్తతో విడిపోతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ రామ్ తో విడిపోతున్నట్టు వార్తలు వినిపించాయి.
Advertisement
ప్రస్తుతం వారిద్దరు దూరంగా ఉంటున్నారు. ఏ క్షణంలో అయినా వారి విడాకుల అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తన భార్య ఊహతో విడిపోతున్నట్టుగా ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరో శ్రీకాంత్ హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
దాదాపు వీరు పెళ్లి చేసుకుని 25 ఏళ్ల అవుతోంది. ఇప్పటివరకు వీరి గురించి ఎలాంటి వార్తలు వినిపించలేదు. కానీ ఈ సీనియర్ జంట గురించి ఇప్పుడు విడాకుల వార్తల వినిపించడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకాంత్ ఊహ కలిసి 1997లో ఇవి సత్యనారాయణ దర్శకత్వంలో తాళి అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడగా ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రోషన్ తో పాటు మరో కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. ఇప్పటికే రోషన్ హీరోగా కూడా పరిచయమై సినిమాలు చేస్తున్నాడు.
రోషన్ సినిమా ఫంక్షన్లకు సైతం శ్రీకాంత్ ఊహ కలిసి వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడూ ఫ్యామిలీ ఫంక్షన్లకు… సినిమా ఫంక్షన్లకు కలిసి వచ్చిన వీరిద్దరు అన్యోన్యంగా కల్పించేవారు. అలాంటి జంట విడిపోతుంది అని వార్తలు రావడంతో ప్రేక్షకులు అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య కలహాలు రావడంతో విడిపోతున్నారు అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే శ్రీకాంత్ నోరు విప్పాల్సిందేనని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.