టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తరుణంలోనే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి వల్ల నడవటం కూడా కష్టమవుతుందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం సమంత ఒంటరిగా జీవనం సాగిస్తున్నారని అదే సమంతకు శాపం అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విడాకులు తీసుకోకుండా ఉంటే సమంతకు అక్కినేని కుటుంబం సపోర్టు లభించి ఉండేది. సమంత ఆరోగ్య స్థితి గురించి చైతన్యకు స్పందించాలని ఉన్నప్పటికీ.. స్పందిస్తే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే ఛాన్స్ ఉందని చైతన్య భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : తనకంటే 7ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిన బాలయ్య హీరోయిన్..? ఆమె భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!
Advertisement
తాను స్పందించి సమంత నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయినా నష్టపోయేది తానేనని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సమంత జాతకంలో కూడా దోషాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన హరి శాస్త్రి సమంత జాతకం గురించి మాట్లాడుతూ.. ఆమె జాతకం ప్రకారం.. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పారట. వృత్తిపరంగా మాత్రం ఆమె జాతకం చాలా బాగుందని పేర్కొన్నారు. సమంత వ్యక్తిగత జాతకంలో శని సంచారం ఉందని, జాతకం ప్రకారం అభిప్రాయ భేదాలు వల్లే విడిపోయారని పేర్కొన్నారు. సమంత చైతన్య ఇప్పట్లో కలిసే అవకాశాలు లేవని హరిశాస్త్రి చెప్పుకొచ్చారు.
Advertisement
చైతన్య జాతకం ప్రకారం.. ఆయనకు ఎమోషనల్ లెవెల్స్ చాలా ఎక్కువని, మాట పట్టింపులకు ప్రాధాన్యత ఇస్తాడని ఆయన కామెంట్లు చేశారు. నాగ చైతన్య సమంత విడిపోయినా వాళ్లు శత్రువుల మాదిరిగా అయితే ఉండరని చెప్పారు. హరి శాస్త్రి వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అటు వ్యక్తి పరంగా ఇటు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు. సరైన ప్రాజెక్టులను ఎంచుకునే సమంత కెరీర్ లో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.
Also Read : మహేష్ బాబు తన కెరీర్లో కేవలం ఒక్క సినిమాకి మాత్రమే మేకప్ వేసుకోలేదు.. అది ఏ సినిమానో తెలుసా ?