టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య గతేడాది డిసెంబర్ లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇద్దరి మధ్య మస్పర్దలు రావడంతో ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. విడాకులకు కారణం చైతూ అని కొంతమంది ప్రచారం చేస్తే మరికొందరు సమంత చైతూకు ఇష్టం లేని పాత్రలు చేయమే కారణమని ప్రచారం చేశారు. మరోవైపు సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేదని ఆ కారణం వల్లనే అక్కినేని ఫ్యామిలీతో గొడవలు జరిగాయని వార్తలు వినిపించాయి.
ఆ గొడవల వల్ల ఇద్దరూ విడాకులు తీసకున్నారని ప్రచారం జరిగింది. ఇక ఇద్దరి మధ్య విడాకులకు అసలు కారణం ఏంటి అన్నది ఇప్పడటి వరకూ తెలియలేదు. కానీ సమంత ఓ ఇంటర్వ్యూలో చైతూతో తనను ఒకే గదిలో ఉంచితే పదునైన ఆయుదాలు కూడా కావాలంటూ తనకు చైతూ పై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా సమంతకు సన్నిహితులు అయిన సద్గురు ఆమెకు రెండో పెళ్లి చేసుకోవాలని సూచించారని ఆయనే ఓ అబ్బాయిని కూడా చూపించారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత మళ్లీ ప్రేమలో పడింది అంటూ ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం సమంత ధరించిన ఓ టీషర్ట్. తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో సమంత టీషర్ట్ పై నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవవు అంటూ రాసి ఉంది.
దాంతో చైతూతో విడాకుల తరవాత సమంత ఇంతకాలం ఒంటరిగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు ప్రేమలో పడిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అందువల్లే ఇప్పుడు తన టీషర్ట్ ద్వారా ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా సమంత ఇప్పుడు సద్గురు చూపించిన అబ్బాయితోనే ప్రేమలో ఉందా అనే వార్తలు కూడా గుప్పు మంటున్నాయి.
ALSO READ : రష్మిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రాకపోవడం వెనుక ఇంత కథ ఉందా ?