ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పగ్గాలు అందుకు భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. జట్టును బాగానే నడిపించాడు. దాంతో ఈ ఏడాది కూడా తన కెప్టెన్ గా పంత్ నే కొనసాగించింది ఢిల్లీ జట్టు. అయితే ప్రస్తుతం ఈ ఐపీఎల్ 2022 లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ లలో 7 విజయాలు నమోదు చేసి ఢిల్లీ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. అయితే ప్లే ఆఫ్స్ కు ఎంతో ముఖ్యమైన పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ ఔట్ అయిన తీరును మాజీ ఆటగాళ్లు తప్పుబడుతున్నారు.
Advertisement
పంత్ నిన్నటి మ్యాచ్ లో ఇగో వల్లనే ఔట్ అయ్యాడు అని మాజీ ఆటగాడు కామెంటేటర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. దాంతో పంత్ స్థానంలో బ్యాటింగ్ కు లలిత్ యాదవ్ వచ్చాడు కానీ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన పంత్ ఇగో వాళ్ల ఔట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో పంత్ వచ్చిన వెంటనే లియామ్ లివింగ్‌స్టోన్ బంతిని అందుకున్నాడు. దాంతో లివింగ్‌స్టోన్ బౌలింగ్ లో సిక్సులు కొట్టని అనే ఉదేశ్యంతో భారీ షాట్ కు ప్రయత్నించినా పంత్ ఔట్ అయ్యాడు.
Advertisement
పంత్ బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత.. అతని మానసిక పరిస్థితిని అర్ధం చేసుకున్న లియామ్ లివింగ్‌స్టోన్ కూడా దానికి తగ్గట్లుగా బౌలింగ్ చేసి… పంత్ ఇగోతో ఆడి వికెట్ తీసుకున్నాడు. అందువల్ల ఓ కెప్టెన్ గా ఆటగాడిగా పంత్ ఇగోను వదలకపోతే చాలా నష్టం ఉంటుంది అని ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేసాడు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో తగబడి ఢిల్లీ కేవలం 159 పరుగులే చేసింది. కానీ ఆ తర్వాత ఆ జట్టు బౌలర్లు బాగా రాణించి పంజాబ్ ను కట్టడి చేసారు. దాంతో 17 పరుగుల తేడాతో ఆజట్టు విజయం అందుకుంది.
ఇవి కూడా చదవండి :
తిలక్ వర్మ అన్ని ఫార్మట్స్ లో భారత్ కు ఆడుతాడు..!
టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!