మణిరత్నం తమిళ దర్శకుడు అయినప్పటికీ పాన్ ఇండియా లెవల్ లో ఆయనకు క్రేజ్ ఉంది. క్లాసిక్ చిత్రాల దర్శకుడుగా మణిరత్నం అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం మణిరత్నం తన కెరీర్ లో మొదటి సారి భారీ గ్రాఫిక్స్ తో మరియు తారాగణంతో సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమానే పొన్నియన్ సెల్వన్. సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవిలు ప్రధాన పాత్రలలో నటించారు.
Advertisement
ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యరాయ్ హీరోయిన్ లుగా నటించారు. చోళులరాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను ముందు నుండి బాహుబలితో పోలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ…..బాహుబలి ఆల్రెడీ ఉంది మరో బాహుబలి అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. దానికి కారణం సినిమా పోస్టర్ లలో గెటప్ లు టీజర్ ట్రైలర్ లు కూడా బాహుబలి లా పోలి ఉండటమే.
Advertisement
అయితే ఇప్పుడు తమిళనాట మరోరకమైన ప్రచారం జరుగుతుంది. బాహుబలి సినిమాలోనే పొన్నియన్ సెల్వన్ సినిమా సీన్లను కాపీ కొట్టారట. అయితే ఈ పొన్నియన్ సెల్వన్ సినిమా నుండి కాపీ కొట్టేలేదట. అసలు ఈ సినిమానే కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. కాబట్టి ఈ నవలలో ఉండే పుస్తకాలే సినిమానూ ఉంటాయి.
కాగా అయితే అలాంటి సీన్లు కొన్ని బాహుబలి సినిమాలో ఉన్నాయి. దాంతో పొన్నియన్ సెల్వన్ నవల లోని సీన్లను జక్కన్న కాపీ కొట్టాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే జక్కన్న ను బీట్ చేయలేకనే తమిళ నాట ఈ ప్రచారం మొదలు పెట్టారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.