Home » నరేష్ పవిత్రల బంధం మూన్నాళ్ల ముచ్చ‌టేనా..? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది….?

నరేష్ పవిత్రల బంధం మూన్నాళ్ల ముచ్చ‌టేనా..? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది….?

by AJAY
Ad

టాలీవుడ్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో స‌హ‌జీవనం చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం మీడియాలో వార్తలు చ‌క్క‌ర్లు కొన్నిన సంగ‌తి తెలిసిందే. నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు కాగా ముగ్గురు భార్యలతో విడాకులు తీసుకున్నాడు. నరేష్ కు 30 ఏళ్ల కొడుకు తో పాటు మరో కుమారుడు సైతం ఉన్నాడు. నరేష్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు.

Advertisement

అయితే రమ్య రఘుపతి ప్రవర్తన తనకు నచ్చలేదని అందువల్లే ఆమెకు విడాకులు ఇచ్చానని నరేష్ గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇక రమ్య రఘుపతితో విడాకుల అనంతరం నరేష్ పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా చెన్నైలోని ఓ హోటల్లో నరేష్ పవిత్ర లోకేష్ ను రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది.

Advertisement

దాంతో కొన్ని రోజులపాటు నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ కు సైతం బ్రేకప్ చెప్పాడు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కూ నరేష్ పవిత్ర లోకేష్ కలిసి ఒకే ఇంటిలో ఉండే వారట. కానీ ప్రస్తుతం నరేష్ ఆమెకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతకాలంగా నరేష్ ఏ కార్యక్రమానికి వచ్చినా ఆయన వెంట పవిత్ర లోకేష్ కనిపించడం లేదు.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ కు గుడ్ బై చెప్పి మరో నటితో ప్రేమాయణం సాగిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు నరేష్ పవిత్ర లోకేష్ ఓ కాంట్రాక్టు చేసుకుని సహజీవనం చేసినట్టు తెలుస్తోంది. ఇంతకాలం ఉంటే ఇన్ని కోట్లు చెల్లించాలి అనే లెక్కన ఇద్దరూ కలిసి ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు నరేష్ ఆమెకు దూరంగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల‌లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే నరేష్ లేదా పవిత్ర లోకేష్ నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading