కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. కన్నడంతో పాటు హిందీ, తెలుగులో కూడా భారీ వసూళ్లనే రాబడుతున్నది. ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో భారీగానే క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 1తోనే హీరో యష్ ఫేమస్ అయ్యాడు. ఇక కేజీఎఫ్2 కి దర్శకుడు ప్రశాంత్ నీల్ బాగా పాపులర్ అయ్యాడు. కేజీఎఫ్ చాప్టర్ విడుదల తరువాత ఇతను చాలా మంది తెలుగు హీరోలకు కథలు చెప్పాడు. కానీ వారిలో ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా ఆసక్తి కనబరచలేదు.
కేజీఎఫ్ 2 విడుదల తరువాత ఇతని కాల్షీట్ల కోసం రిజెక్ట్ చేసిన హీరోలకు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ తెలుగు వారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ప్రశాంత్‌నీల్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. హీరో తల్లి సమాధిని ముంబయి నుంచి కేజీఎఫ్ తీసుకొచ్చి అక్కడ సమాధి కట్టించడంపై ఓ ప్రశ్న ఎదురైనది. ఈ ఆలోచన ఎలా వచ్చిందనే అంశంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. అది నా రియల్ థాట్ అని.. ప్రాక్టికల్‌గా కుదరదు అని సినిమాలో పెట్టుకున్నానని చెప్పాడు. అదేవిధంగా మా నాన్నమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం అని.. ఆమెతో నాకు ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. నేను ఎంత తిట్టినా ఆమె నాతోనే ఉండేది. నేను తినకపోతే దగ్గర ఉండి మరీ తినిపించేది అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.
Advertisement
Advertisement
ఎప్పుడైతే మా నాన్నమ్మ మరణించిందో.. ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి మాకు కర్ణాటకలో సొంత స్థలం లేదు. వేరే దారి లేక ఏపీలోని మా సొంతూరులో అంత్యక్రియలు జరిపించామని తెలిపారు. ఏదో ఒక రోజు ఆమె సమాదిని అలాగే తీసుకొచ్చి మా ఇంటి వాకిట్లో పెట్టుకోవాలని అప్పుడే అనుకున్నట్టు చెప్పాడు. ఆ విధంగా అనుకున్నట్టుగానే నా సినిమాలో ఆ సీన్ పెట్టినట్టు చెప్పారు. ఇప్పటికీ ఆమెను మిస్ అవుతూనే ఉన్నానని ఎమోషనల్ కామెంట్స్ చేసాడు. ఏపీలోని మా సొంత ఊరు అని ప్రశాంత్ నీల్ అనగానే.. ఇతను మన తెలుగోడే అని అందరూ సంతోషపడుతూ.. మనోడే అని కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- KGF లో రాఖీబాయ్ తల్లి పాత్ర చేసిన అమ్మాయి వయసు ఎంతో తెలిస్తే షాకే..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ భారత్‌కు గుడ్ బై.. కారణం ఏమిటంటే..?
- ఆరేళ్లలోపు పిల్లలు ఉంటే జాగ్రత్త.. ఆ వ్యాధి సోకిందంటే కుప్పకూలుతున్న చిన్నారులు.. ఎక్కడంటే..!!