సాధారణంగా గుడికి వెళ్లిన తరువాత ఎవరైనా సరే తీర్థం తీసుకుంటారు. తీర్ధం తీసుకున్నాక చాలా మంది చేతులను తలకు అద్దుకుంటారు. అలా చేయడం మంచిదా కాదా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. కొంతమంది మంచిదని, కొందరు మంచిది కాదని చెప్పడంతో గుడికి వెళ్లిన భక్తులు తీర్ధం తీసుకున్నాక ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోతుంటారు.
Advertisement
Advertisement
నిజానికి తీర్ధం తీసుకున్నాక తడిని తలకు తుడుచుకోవడం చాలా తప్పు. దేవాలయాల్లో తీర్ధం తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు. శిరస్సు భాగంలో అనేక మంది దేవతలు ఉంటారు. తీర్ధం తీసుకున్న తరువాత ఆ చేతికి ఎంగిలి అంటుకుంటుంది.
ఎంగిలి అంటుకున్న చేతిని తలకు రాసుకుంటే దేవతలను అవమానించినట్టే అవుతుంది. అందుకే తీర్ధం తీసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతిని తలకు రాయకూడదు. ఈ విషయాలను జాగ్రత్తగా పాటిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.