Home » హారతి కర్పూరం కళ్లకు అద్దుకోవడం మంచిదేనా..?

హారతి కర్పూరం కళ్లకు అద్దుకోవడం మంచిదేనా..?

by Sravanthi
Ad

మన హిందూ సంప్రదాయాల్లో అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మన పూర్వికుల నుంచి ఈ సాంప్రదాయాలను వారు పాటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ మనం కూడా వాటిని పాటిస్తూ ఉన్నాం. అలాంటి ప్రతి సంప్రదాయం వెనుక చాలా పెద్ద హిస్టరీ దాగి ఉంది. అలాంటి వాటిలో దేవుడి దగ్గర పెట్టిన హారతి తీసుకోవడం ఒకటి. మరి చాలామందికి దేవుడి దగ్గర పెట్టిన హారతి కళ్ళకు అద్దుకోవచ్చా లేదా అనేది ఒక అనుమానం.. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Advertisement

Also Read;జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు తీవ్ర అనారోగ్యం…అండ‌గా నిలిచిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్..!

భగవంతునికి పెట్టిన హారతి కళ్ళకు అద్దుకోవడం చాలా మంచిదని అంటున్నారు. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కళ్ళకు హారతి అద్దుకోవడం, తీర్థం తీసుకోవడం,శిరస్సుపై శఠగోపం లాంటివి పెట్టడం దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని తినడం వంటివి పూర్వకాలం నుంచి మన పెద్దలు నేర్పిన సంస్కృతి. ఇప్పటికీ దాన్నే పాటిస్తూ వస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కర్పూరా హారతి కళ్ళకు అద్దుకోవడం వల్ల కనురెప్పలకు చాలా మేలు జరుగుతుందని అంటున్నారు.

Advertisement

ముఖ్యంగా కర్పూరంలో ఉండే ఘాటు సుగంధం వల్ల సున్నితమైన కనురెప్పల మీద చేరిన సూక్ష్మజీవులు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కర్పూర హారతిలో దుష్టశక్తి, నరదృష్టి లాంటివి దూరం చేసే నెగిటివ్ ఎనర్జీ ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా దేవాలయంలో స్వామివార్లకు ఇచ్చే హారతి సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి నమస్కరించుకోవాలని, ఈ హారతి వెలుగులో స్వామి వారు సంపూర్ణంగా మనకు కనిపిస్తారని అలాంటి హారతిని కళ్ళకు అద్దుకోవడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

Also Read;అప‌రిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమ‌నించారా..?

Visitors Are Also Reading