Home » ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ మార్పే కారణమా ? అసలు దీని పని ఏంటి ? 

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ మార్పే కారణమా ? అసలు దీని పని ఏంటి ? 

by Anji
Ad

ఒడిశాలోని బాలేశ్వర్ లో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పే కారణం అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అసలు ఇది ప్రమాదానికి ఏరకంగా కారణం అయిందనే విషయాన్ని వెల్లడించలేదు. త్వరలోనే రాబోయే పూర్తి నివేదికలో కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారకులను, ప్రమాద పరిస్థితులను కచ్చితంగా వెల్లడిస్తామని వివరించారు మంత్రి. రైల్వేలో ప్రమాదాల నివారణకు ఈ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుంది. 

Advertisement

ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థ. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేవిధంగా చేయడం.. సిగ్నల్స్ లో ఎలాంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటమే దీని పని . ఇంటర్ లాకింగ్ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన తరువాత రైళ్లు ఢీ కొనడాలు చాలా తగ్గాయి. దీంతో పాటు రైల్వే ఆపరేషన్ లలో భద్రత మరింత బలోపేతం చేశారు. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణకు ఈ వ్యవస్థ ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థ, కంప్యూటర్లను వినియోగించుకుంటుంది. గతంలో మాన్యూవల్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థతో భర్తీ చేస్తారు. గతంలో సిగ్నల్స్ ని నియంత్రించడానికి రాడ్లు, స్విచ్ లను ఉపయోగించేవారు. 

Advertisement

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో వేగంగా స్పందించే అవకాశం ఉంది. రైళ్ల నియంత్రణకు సౌకర్యవంతంగా ఉండటం, కచ్చితత్వం వంటి సానుకూలాంశాలు ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థలో ట్రాక్ పై రైళ్ల లొకేషన్లను గుర్తించడానికి సెన్సార్లు, ఫీడ్ బ్యాకింగ్ పరికరాలు వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ సురక్షితను పెంచేందుకు ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నల్స్ , పాయింట్స్, ట్రాక్ సర్క్యూట్స్ వంటి వాటితో అనుసంధానమై పని చేస్తుంది. దీంతో వాటిని సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఒకే మార్గంపై రెండు రైళ్లు రాకుండా చేస్తుంది. రూట్ సెట్టింగ్, రూట్ రిలీజ్, పాయింట్ ఆపరేషన్స్, ట్రాక్ ఆక్యూపెన్సీ మానిటరింగ్, ఓవర్ లాప్ ప్రొటెక్షన్, క్రాంక్ హ్యాండిల్ ఆపరేషన్స్, లెవల్ క్రాసింగ్ గేట్ ఇంటర్ లాకింగ్, ప్రొవిజన్ ఫర్ బ్లాక్ వర్కింగ్ వంటి పనులను చేస్తుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కి ఆ పేరు పెట్టడం వెనుక దాగి ఉన్న స్టోరీ ఏంటో తెలుసా ?

 మహేష్ బాబు ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ సెంటిమెంటేనా..?

శర్వానంద్ కు ఇన్ని కోట్ల కట్న కానుకలు ఇచ్చారా..?

Visitors Are Also Reading