అయోధ్య భూవివాద కేసు కక్షదారుల్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. బాబ్రీ మసీదుకు కీలక మద్దతుదారుగా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిశారు. రామ్ పత్ సమీపంలోని కోటియా పంచిటోలాలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో రామమందిర భూమిపూజ సమయంలోనూ మొదటి ఆహ్వాన పత్రికను ఇక్బాల్ అన్సారి అందుకున్నాడు.
Advertisement
రామమందిరం అంశంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లింలు, సమాజం గౌరవిస్తుందని….కొన్ని రోజుల కింద ఇక్బాల్ అన్సారీ చెప్పాడు. తాజాగా ఆహ్వాన పత్రిక అందిన అనంతరం మాట్లాడిన ఇక్బాల్ అన్సారీ జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లనున్నట్లు చెప్పారు. అయోధ్యలో హిందువులకు, ముస్లింలకు మధ్య ఎలాంటి భేదభావాలు లేవని…. అంతా కలిసే కలిసిమెలిసి ఉంటారని పేర్కొన్నారు. గుడి, మసీదు, గురుద్వారా దేనిపైన భేదభావాలు ఉండవని చెప్పారు.
ప్రధాని మోదీ ఇటీవల అయోధ్య వచ్చిన సమయంలో తానే స్వయంగా పూలతో స్వాగతం పలికినట్టు ఇక్బాల్ అన్సారి గుర్తు చేశాడు. ఆయన ఎప్పుడూ అయోధ్య వచ్చిన స్వాగతం పలుకుతానని చెప్పాడు. రామ మందిరం పనులు పూర్తయ్యాయి. అయోధ్య ప్రజలు ఆనందంగా ఉన్నారు. మేము కూడా ఆనందంగా ఉన్నాము. మొత్తం సమాజం సంతోషంగా ఉంది. హిందూ, ముస్లింల మధ్య సహోదరవత్వం ఉందని ఇక్బాల్ అన్సారి చెప్పాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.