ఐపీఎల్ అనేది ఒక బ్రాండ్. 2008 లో బీసీసీఐ ప్రారంభించిన ఈ టోర్నీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బీసీసీఐని ఒక రేంజ్ లో నిలబెట్టింది. డబ్బు, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఐపీఎల్ ను కొట్టే మరో క్రికెట్ లీగ్ లేదు. అంతెందుకు ఐసీసీ టోర్నీలకు కూడా ఐపీఎల్ రేంజ్ ఉండదు. అయితే ఈ లీగ్ ద్వారా బీసీసీఐ ఎన్నో వేలకోట్లను ఆర్జిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
Advertisement
గత ఏడాది వరకు 8 జట్లతో జరిగిన ఈ లీగ్ లో ఈ ఏడాది మరో రెండు కొత్త జట్లనుకూడా చేర్చింది. లక్నో, గుజరాత్ పేరిట వచ్చిన ఈ రెండు జట్లతో 8 వేల కోట్లకు పైగా ఆర్జించిన బీసీసీఐ.. ఇప్పుడు మరింత ఆదాయం సంపాదించాలనే ఆలోచన చేస్తుంది. అదేంటంటే.. వచ్చే ఏడాది నుండి ఐపీఎల్ లీగ్ లో జరిగే మ్యాచ్ ల సంఖ్యను పెంచాలని భావిస్తుంది బీసీసీఐ. ఇప్పటికే గత ఏడాది వరకు 60 మ్యాచ్ ల లీగ్ ను 72 మ్యాచ్ లకు పెంచింది.
Advertisement
ఇక వీటిని వచ్చే ఏడాది నుండి మరింతగా పెంచాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. అందుకు అనుమతి కోసం.. ఈ ప్రతిపాదనతో ఐసీసీ ముందుకు కూడా వెళ్ళింది బీసీసీఐ. ఒకవేళ బీసీసీఐకి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది నుండి ఐపీఎల్ మ్యాచ్ లు మరింతగా పెరుగుతాయి. అయితే ఈ మ్యాచ్ లు పెరగడం వల్ల రెగ్యులర్ గా జరిగే సిరీస్ లు తాగుతాయ్ అని కొందరు అభిమానులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
ధోనిని విషయంలో అన్ని జట్లకు అక్తర్ వార్నింగ్..!
ఆ విషయంలో అశ్విన్ ను అనుసరించాలనుకున్న డుప్లెసిస్.. కానీ..?