శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఐపీఎల్ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. ప్రసార హక్కు దారులకు చెల్లించేందుకు డబ్బులు లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్‌టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయాలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్‌లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపివేశాయి.
Advertisement
దేశంలో ఎమర్జెన్సీ నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే మూడులో లేరు అని.. అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. ఐపీఎల్‌లో శ్రీలంక ఆటగాళ్లు హసరంగ ఆర్సీబీ తరుపున, భానుక రాజపక్స పంజాబ్ కింగ్స్ తరుపున దుష్మంత చమీర లక్నో సూపర్ జెయింట్స్ తరుపు, చమిక కరుణరత్నే కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్నారు.
Advertisement
శ్రీలంక ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతుండడంతో వారి మ్యాచ్‌లను చూసే భాగ్యం శ్రీలంక ప్రజలకు లేకపోయింది. ఆసలే కష్టాలు పడుతున్న ప్రజలకు క్రికెట్ మ్యాచ్‌లు వినోదాన్ని అందిస్తాయి అని అందరూ భావించారు. కానీ ఆర్థిక సంక్షోభం అక్కడి వాళ్లు ఆనందాన్ని ఇవ్వలేకపోతోంది. ఇప్పటికే శ్రీలంకలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం కూడా మానేశాయి. కనీసం డిజిటల్ పేపర్లలో కూడా ఐపీఎల్ వార్తల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
Also Read : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. నూతన ఆర్థిక మంత్రి బాధ్యతలు..!