Home » తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీ‌లంక‌.. నూత‌న ఆర్థిక మంత్రి బాధ్య‌త‌లు..!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీ‌లంక‌.. నూత‌న ఆర్థిక మంత్రి బాధ్య‌త‌లు..!

by Anji
Ad

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీ‌లంక‌కు మంత్రి వ‌ర్గం రాజీనామా చేసిన విష‌యం విధిత‌మే. అయితే నూత‌న ఆర్థిక మంత్రిగా అలీ స‌బ్రీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో దేశానికి కొత్త ఆర్థిక మంత్రిగా వ‌చ్చారు. ఇప్ప‌టిదాకా ఆర్థిక మంత్రిగా ఉన్న బాసిల్ రాజ‌ప‌క్స‌ను దేశ అధ్య‌క్షుడు గోట‌బాయ రాజ‌ప‌క్సే తొల‌గించారు. బాసిల్ రాజ‌ప‌క్స సాక్షాత్తు దేశ అధ్య‌క్షుడు గొట‌బాయ‌కు సోద‌రుడే. అయిన‌ప్ప‌టికీ దేశ ఆర్థిక ప‌రిస్థితి విష‌మిస్తున్న నేప‌థ్యంలో త‌న సోద‌రున్ని ఉపేక్షించ‌లేక పోయారు.

Advertisement

Advertisement

బాసిల్‌ను త‌ప్పించి కొత్త ఆర్థిక మంత్రిగా అలీ స‌బ్రీకి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలీ స‌బ్రీ ఇప్ప‌టిదాకా న్యాయ‌శాఖ మంత్రిగా ఉన్నారు. మ‌రి కొత్త ఆర్థిక మంత్రి రాక‌తో శ్రీ‌లంక ద‌శ మారుతుందా అంటే స‌వాల‌క్ష స‌వాళ్లు ఎదురుచూస్తున్నాయి. ద్ర‌వ్యోల్భ‌ణం రాకెట్ల దూసుకుపోతున్న త‌రుణంలో అలీ స‌బ్రీ ఏమి చేయ‌గ‌ల‌రన్న‌ది ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. మ‌రికొన్ని వారాల పాటు శ్రీ‌లంక‌లో ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు నెల‌కొంటే పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు భార‌త్ కు శ‌ర‌ణార్థులుగా త‌రలివ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

Visitors Are Also Reading