ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్కే టీంలు తలపడనున్నాయి.
Advertisement
మార్చి 31 నుంచి మే 21 వరకు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ లు జరగనుండగా, ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నారు. ఐపీఎల్ లో పాల్గొననున్న జట్లలో ఒక్కో జట్టు 16 మ్యాచులు ఆడాల్సి ఉండగా, హోమ్ గ్రౌండ్ లో ఏడు మ్యాచ్ లు, బయట ఏడు మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత మరోసారి ఐపీఎల్ హైదరాబాద్ కు తిరిగి వస్తోంది. గత మూడు సీజన్లుగా కరోనా కారణంగా ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయింది.
Advertisement
అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ అభిమానుల కేరింతలలో మురిసిపోతుంది. హోమ్ గ్రౌండ్ లో, మిగిలిన ఏడు మ్యాచ్ లలో తటస్థ వేదికల్లో ఆడనుంది. అంటే ఈ లెక్కన హైదరాబాద్ లో 7 మ్యాచ్లు జరగనున్నాయి అన్నమాట. ఈసారి ఎస్ఆర్ఎస్ తన తొలి మ్యాచ్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఎనిమిదవ స్థానంలో నిలిచి నిరాశపరచిన సన్రైజర్స్ సొంత గడ్డపై చెలరేగాలని చూస్తోంది. సన్రైజర్స్ టీం గ్రూప్ బి లో ఉంది.
READ ALSO : టీమిండియా క్రికెటర్లకు ఇంజక్షన్లు…బలైన చేతన్ శర్మ