క్రికెట్ అభిమానులను అలరించిన ఐపిఎల్-2023 సమరం తుదిదశకు చేరుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినా అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 4 టైమ్స్ ఛాంపియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ తెలపడనున్నాయి. అయితే… నేషనల్ మీడియా నివేదిక ప్రకారం ఈ సీజన్ లో ఐపీఎల్ లో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీగా రూ. 20 కోట్లు ఇవ్వనున్నారు.
Advertisement
అదేవిధంగా రన్నరప్ కు ప్రైజ్ మనీగా రూ.13 కోట్లు ఇవ్వనున్నారు. ఎలిమినేటర్ విజేత ముంబై ఇండియన్స్ కు 7 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. ఎలిమినేటర్ లో ఓడిపోయిన లక్నో సూపర్ జేయింట్స్ కు 6.5 కోట్లు క్యాష్ రివార్డ్ అందనుంది. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి ప్రైస్ మనీగా రూ.15 లక్షలు అందజేస్తారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ఉన్నాడు.
Advertisement
ఓవరాల్ గా ఈ ఏడాది సీజన్ లో 16 మ్యాచులు ఆడిన గిల్…851 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడికి ప్రైస్ మనీగా రూ.15 లక్షలు అందజేస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం మహమ్మద్ షమీ (28) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ లో సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్ మన్ కు ప్రైజ్ మనీగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడికి ప్రైస్ మనీగా రూ. 20 లక్షలు ఇవ్వనున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
నా లో దుస్తులు చూడాలని డైరెక్టర్ కోరాడు – ప్రియాంక చోప్రా
Sharwanand : హీరో శర్వానంద్ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !
ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !