Home » Jio దెబ్బకు దిగివచ్చిన స్టార్…ఇక ఫ్రీగా IPL 2023.. ఎలాగంటే !

Jio దెబ్బకు దిగివచ్చిన స్టార్…ఇక ఫ్రీగా IPL 2023.. ఎలాగంటే !

by Bunty
Ad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, వేల కోట్లు పెట్టి ఐపిఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది వయాకం 18. అయితే కస్టమర్ నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు అవకాశం కల్పించింది.

READ ALSO : Citadel : ‘సిటాడేల్’ విడుదల ఖరారు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

జియో సినిమా యాప్ లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఉచితంగా ప్రసారమవుతున్నాయి. వచ్చే ఐపీఎల్ 2023 మ్యాచ్ లు కూడా ఉచితంగా జియో కస్టమర్లకు అందించనుంది వయాకం. దీంతో డిజిటల్ మొబైల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీ ప్లస్ స్టార్ నెట్వర్క్, టెలివిజన్ ప్రసారంలో మార్పులు తీసుకువస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ తమిళ భాషల్లో కొత్తగా HD చానెల్స్ ని లాంచ్ చేయనుంది స్టార్ నెట్వర్క్. అలాగే స్టార్ ఉత్సవ్ మూవీస్ అనే ఫ్రీ ఎయిర్ ఛానల్ లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారం చేయనుంది డిస్నీ స్టార్.

Advertisement

READ ALSO : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్

ఐపిఎల్ చరిత్రలో ఫ్రీ డిష్ ఛానల్ లో మ్యాచ్లు రావడం ఇదే తొలిసారి. అయితే అన్ని మ్యాచ్లు ఉచితంగా చూసేందుకు అవకాశం లేదు. కేవలం మొదటి 12 మ్యాచ్లు మాత్రమే ఈ ఛానల్ లో ఫ్రీగా వస్తాయి. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్లు కావాలంటే స్టార్ స్పోర్ట్స్ చానల్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పటికే ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోవడంతో డిస్నీ హాట్ స్టార్ కి వేల కోట్ల నష్టం జరిగింది. ఐపిఎల్, ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాదని తెలిసిన వెంటనే చాలా మంది ఆ యాప్ అని మొబైల్ నుంచి తొలగించారు. ఇలా ఐపిఎల్ మీడియా హక్కుల వేలం ముగిసిన నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 18 శాతం కష్టమర్లను కోల్పోయింది డిస్ని ప్లస్ హాట్ స్టార్. అది కాకుండా యాప్ ఉన్నా, దాన్ని రీఛార్జ్ చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది.

read also : చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!

Visitors Are Also Reading