గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 55 పరుగులు తేడాతో పరాజయం పాలైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవీలియన్ క్యూ కట్టారు. వదెరా 40, గ్రీన్ 33, సూర్యకుమార్ 23 రన్స్ చేయడం మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వేనుతిరిగారు. దీంతో ముంబై 152/9 రన్స్ కి పరిమితమైంది. గుజరాత్ బౌలర్లలో నూర్ 3, రషీద్, మోహిత్ చెరో 2, హార్దిక్ ఒక వికెట్ తీశారు.
READ ALSO : Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?
Advertisement
అయితే ఈ మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్ లో తన తొలి సిక్సర్ బాధాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ తొమ్మిదవ నెంబర్ ఆటగాడిగా క్రీజ్ లోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి మోహిత్ శర్మ వేసిన బాల్ ని భారీ సిక్సర్ కొట్టాడు. మోహిత్ షార్ట్ బాల్ వేశాడు. అర్జున్ టెండూల్కర్ డీప్ స్క్వేర్ దిశగా సిక్సర్ కొట్టాడు.
READ ALSO : దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement
ఇది హైలెట్ గా నిలిచింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే అర్జున్ టెండూల్కర్ కు ఇది తొలి ఐపిఎల్ సీజన్… అంతేకాదు అర్జున్ కెరీర్ లో తొలి సిక్సర్ కూడా ఇదే. అర్జున్ టెండూల్కర్ బౌలర్గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు ఈ సిక్సర్ తో బ్యాటింగ్ లోను అలరించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అర్జున్ టెండూల్కర్ లో మంచి టాలెంట్ ఉందని, బ్యాటింగ్ లో ప్రమో షన్ ఇవ్వాలని కోరుతున్నారు.
READ ALSO : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !
First six in the IPL for Arjun Tendulkar 👏
🎥: JioCinema #GTvMI #ArjunTendulkar #IPL2023 #TATAIPL2023 #CricketTwitter
— Niche Sports (@Niche_Sports) April 25, 2023