Home » స్టైల్ కోసం కాదట‌…కృష్ణ కూలింగ్ గ్లాస్ లు ఎందుకు ధ‌రించేవారో తెలుసా..?

స్టైల్ కోసం కాదట‌…కృష్ణ కూలింగ్ గ్లాస్ లు ఎందుకు ధ‌రించేవారో తెలుసా..?

by AJAY
Ad

తెలుగు నాట ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కృష్ణ సూపర్ స్టార్ గా ఎదిగారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి ఆ పాత్రను మరొకరు చేయలేరు అని నిరూపించారు. అంతేకాకుండా కౌబాయ్ సినిమాలను టాలీవుడ్ కు పరిచయం చేసి తెలుగు జేమ్స్ బాండ్ గా ఆయన పేరు సంపాదించుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ మన మధ్యన లేకపోయినా ఆయన సినిమాల ద్వారా బ్రతికే ఉంటారు.

Advertisement

కాగా సూపర్ స్టార్ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన ప‌లు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక‌టి కృష్ణ న‌ల్ల క‌ల్లద్దాల‌ను ద‌రించ‌డం. కృష్ణ ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చినా కూలింగ్ గ్లాసులతో కనిపించేవారు అన్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణ కూలింగ్ గ్లాస్ లు ధరించడం వెనక ఓ కారణం కూడా ఉంది, ఆ విషయాన్ని ఆయన సతీమణి విజయ నిర్మల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Advertisement

అంతేకాకుండా ఏ పబ్లిక్ మీటింగ్ కు వెళ్లిన కృష్ణతో పాటు తాను వెంట వెళ్లడానికి కారణం కూడా చెప్పారు… కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని కాపాడుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చిందని విజ‌య నిర్మ‌ల అన్నారు. ఎక్కడైనా ఆడవాళ్లు కనిపించారంటే కృష్ణకి కూలింగ్ గ్లాసులు వేసేస్తానని అన్నారు. దానికి కారణం ఎవరైనా ఆడవాళ్లు కళ్ల‌లోకి చూస్తే కృష్ణ చాలా ఇబ్బందిగా ఫీలవుతారని చెప్పారు.

వారి కండ్ల‌లోకి నేరుగా చూడలేరని…. అందుకే అలా కూలింగ్ గ్లాసులు పెట్టేదాన్ని అన్నారు. అంతే కాకుండా చెన్నై లోని మీసాల కృష్ణుడు దేవాలయంలో ఓ పాట షూటింగ్ పూర్తిచేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగిందని చెప్పారు. అప్పుడు గుడి బ‌య‌ట ఉన్న‌ కమెడియన్ రాజబాబు.. త‌మ‌ను చూసి ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇక్కడ షూటింగ్ లో పెళ్లి చేసుకున్న వాళ్లంతా నిజంగా పెళ్లి చేసుకున్నారు అని జోష్యం చెప్పార‌ని అన్నారు. చివరికి తమ విషయంలోనూ అదే నిజమైందని విజయనిర్మల వెల్లడించారు.

Visitors Are Also Reading