మిర్చి సినిమాతో టాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకున్న విలన్ సంపత్ రాజ్. ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రభాస్ తో ఢీ కొట్టి ప్రేక్షకులను మెప్పించాడు. గంభీరమైన వాయిస్ ఆరడుగుల కటౌట్ తో సంపత్ రాజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమా తరవాత సంపత్ రాజ్ వరుస అవకాశాలను అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు.
Advertisement
అంతే కాకుండా కేవలం సీరియస్ విలన్ పాత్రలే కాకుండా విలన్ పాత్రలోనే నటిస్తూ నవ్వులు పూయించే పాత్రలలోననూ మెప్పిస్తున్నాడు. అయితే సంపత్ రాజ్ సినిమా జీవితం గురించి చాలా మంది ప్రేక్షకులకు తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి అతికొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇక సంపత్ రాజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ తల్లిగా నటించిన శరణ్య సంపత్ రాజ్ భార్య అని ప్రచారం జరిగింది.
Advertisement
వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో అంతా సంపత్ రాజ్ శరణ్య భార్యభర్తలనే అనుకున్నారు. అయితే ఈ విషయం పై సంపత్ రాజ్ ఆలీతో జాలీగా టీవీ షో లో క్లారిటీ ఇచ్చారు. శరణ్య తన భార్య అంటూ ప్రచారం చేశారని కానీ అందులో నిజం లేదని చెప్పారు. తనకు శరణ్య మంచి ఫ్రెండ్ అని చెప్పారు.
తాము ఓ సినిమాలో కలిసి నటించామని ఆ సినిమా సమయంలో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయని చెప్పారు. అంతే కాకుండా తనకు ఇప్పటికే వేరే మహిళతో వివాహం జరిగిందని ఓ కూతురు కూడా ఉన్నారని చెప్పాడు. కానీ సినిమాల్లోకి వచ్చిన తరవాత తన భార్యతో విడిపోయానని అన్నారు. మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నారు.
also read :Shaakuntalam : “శాకుంతలం” ఫ్లాప్ టాక్ రావడానికి ఈ మైనస్ లే కారణమా..?