Home » ర‌వితేజ వెంకీ సినిమాతో పోటీప‌డి బోల్తాకొట్టిన సినిమాలు ఇవే..? లిస్ట్ లో ఆ స్టార్ హీరో సినిమా కూడా..?

ర‌వితేజ వెంకీ సినిమాతో పోటీప‌డి బోల్తాకొట్టిన సినిమాలు ఇవే..? లిస్ట్ లో ఆ స్టార్ హీరో సినిమా కూడా..?

by AJAY
Ad

శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేట‌ర్ ల‌లో సంద‌డి చేస్తుంటాయి. సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డ‌తారు. ఇక పండ‌గ‌ల స‌మ‌యంలో అయితే వ‌రుస సినిమాలు విడుద‌ల‌వుతాయి. అంతే కాకుండా ఒక హీరోకు పోటీగా మ‌రో హీరో సినిమాను విడుద‌ల చేస్తుంటారు. అలా పోటీప‌డిన‌ప్పుడు ఎవరిది హిట్ అవుతుందో ఎవ‌రిది ఫ్లాప్ అవుతుందో చెప్పాలేం.

Advertisement

అలా ర‌వితేజ వెంకీ సినిమాతో పోటీప‌డి చాలా సినిమాలు బోల్తా కొట్టాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ర‌వితేజ హీరోగా న‌టించిన వెంకీ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌ఖ్యంగా కామెడీ అదిరిపోయింది. ఇప్ప‌టికీ ఈ సినిమాలోని కామెడీ సీన్లు ఇస్ స్టాగ్రామ్ లో ద‌ర్శ‌నం ఇస్తుంటాయి. ఈ సినిమా 2004 మార్చి 5న‌ విడుద‌ల‌య్యింది.

Advertisement

ఇక ఇదే ఏడాది మొత్తం ఏడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఆ యేడాది లో మార్చిలో శ్రీహ‌రి వ‌డ్డే న‌వీన్ లు ప్ర‌ధానపాత్ర‌ల‌లో గురి సినిమా విడుద‌ల‌య్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ త‌ర‌వాత అదే యేడాది తేజ ద‌ర్శ‌క‌త్వంలో జై సినిమా విడుద‌లైంది. ఈ సినిమాతో న‌వ‌దీప్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కానీ ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

raviteja srinu vaitla

raviteja srinu vaitla

ఈ సినిమాకు ఒక్క‌రోజు గ్యాప్ లో ర‌వితేజ న‌టించిన వెంకీ సినిమా విడుద‌ల‌య్యింది. ఈ చిత్రానికి శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా స్నేహ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో ట్రైన్ లో వ‌చ్చే కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్వించాయి. స్నేహ తో ల‌వ్ ట్రాక్ ర‌వితేజ న‌ట‌న కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దేవిశ్రీ అందించిన స్వారాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుద‌లైన రోజునే ఆర్పీప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనువాసంతి ల‌క్ష్మి సినిమా విడుద‌లైంది. ఈ సినిమా కొంత‌మంది ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అవ్వ‌లేక‌పోయింది.

Visitors Are Also Reading