ఒకప్పటి హీరోల కొడుకులు చాలా మంది హీరోలుగా రానిస్తున్నారు. కానీ ఒకప్పటి హీరోయిన్ ల కూతుళ్లు మాత్రం అతికొద్ది మాత్రమే ఇండస్ట్రీలో రానిస్తున్నాయి. అలా హీరోయిన్ గా రానిస్తున్న ఒకప్పటి హీరోయిన్ కూతురే కీర్తిసురేష్…ఈ పేరు కంటే కీర్తి మహానటిగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. రామ్ హీరోగా నటించిన నేను శైలజ సినిమాలో కీర్తి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటూ కీర్తి సురేష్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Advertisement
ఇక మహానటి సినిమాతో కీర్తిసురేష్ ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమా ఇతర భాషల్లోనూ మంచి విజయం సాధించింది. దాంతో ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కీర్తిసురేష్ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
Advertisement
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక. తెలగుతో పాటూ తమిళ, మలయాళ భాషల్లో మొత్తం వందకు పైగా సినిమాల్లో మేనక నటించి అలరించారు. అంతే కాకుండా మేనక చిరుకు జోడీగా కూడా నటించారు. వీరిద్దరూ కలిసి పున్నమి నాగు అనే సినిమాలో హీరోహీరోయిన్ లు గా నటించారు.
మేకన అసలు పేరు పద్మావతి కాగా సినిమాల్లోకి వచ్చిన తరవాత ఆమె పేరును మేనకగా మార్చుకున్నారు. ఇదిలా ఉండగా మేనక 1987లో ప్రముఖ మలయాళ ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. ఇక ఒకప్పుడు మేకన మెగాస్టార్ సరసన సినిమాలు చేస్తే ఇప్పుడు ఆమె కూతురు సైతం మెగాస్టార్ సినిమాల్లో నటించడం విశేషం.