యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఎన్టీరామారావు నటవారసుడుగా వచ్చి తండ్రికి తగ్గ మనవడు అనిపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆర్ఆర్ఆర్ కు ముందు ఎన్టీఆర్ కేలవం టాలీవుడ్ లోనే అభిమానులు ఉండేవారు. కానీ ఆర్ఆర్ఆర్ తరవాత ఆ సినిమా చూసిన దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయారు.
ALSO READ :వ్య**చారం కేసుపై ఇప్పటికీ వేధిస్తున్నారు : నటి యమున
Advertisement
ఇక ప్రస్తుతం ఈ సినిమా టీమ్ ఆస్కార్ కోసమై అమెరికాలో ఆస్కార్ ఉత్సవాల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పుడే కాదు చిన్నతనంలోనే స్టార్ హీరోలకు పోటీ ఇచ్చాడు. కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ ను చిన్నవయసులోనే ఆయన తాత ఎన్టీరామారావు సినిమాల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ చిన్నతనంలో బాలరామాయణం సినిమాలో నటించాడు. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమా నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాకు పోటీగా అదే సమయంలో విడుదలైంది.
అయితే అన్నమయ్య కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ బాలరామాయణం కూడా ప్రేక్షకుల మన్నలను పొంది ఆ సినిమాకు పోటీ ఇచ్చింది. అంతే కాకుండా బాలరామాయణం సినిమాకు బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమాను గుణశేఖర్ మొత్తం చిన్నపిల్లలతోనే తెరకెక్కించగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాముని పాత్రలో నటించి అదరగొట్టారు.
ALSO READ :ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?