సినిమా డైరెక్టర్ లు ఎవరైనా తాము చూసిన సంఘటనలను లేదంటే జీవిత అనుభవాలను లేదా ఎక్కడైనా విన్నవాటిని ఆధారంగా చేసుకుని సినిమాలుగా మలుస్తుంటారు. కథలను కొత్తగా తమ సొంత టాలెంట్ తో రాసుకున్నా కూడా సినిమాలోని సీన్లను చాలా సీన్లను మాత్రం తమ అనుభవాల ఆధారంగానే రాసుకుంటారు. అలాంటి సన్నివేశాలే ప్రేక్షకులకు కూడా ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాయి.
Advertisement
ఇక తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ఎఫ్ 2 సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఓ టీవీ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ సినిమాలోని కొన్ని సీన్లను తన రియల్ లైఫ్ నుండి తీసుకున్నానని చెప్పారు. తనది ప్రేమ వివాహం అని తన భార్య తన క్లాస్ మేట్ అని వెల్లడించాడు. అంతే కాకుండా ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని తెలిపాడు. తన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని సైతం ఓపెన్ గా చెప్పేశాడు.
Advertisement
తన భార్య తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నాడు. కాలేజీ పూర్తయిన తరవత 2012లో తనకు ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టినట్టు తెలిపాడు. దాంతో తన ఫ్రెండ్ కు ఒకరాయి విసిరి చూద్దాం అన్నట్టుగా కేఫ్ లో మాట్లాడుతుంటే మనం పెళ్లిచేసుకుందామా అని నేరుగా అడిగానని చెప్పాడు. దానికి ఆ అమ్మాయి కూడా ఓకే అనడంతో పెళ్లి చేసుకున్నామని అన్నాడు.
ఇద్దరి కాస్ట్ కూడా ఒక్కటే అవ్వడంతో ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పాడు. ఇక పెళ్లి తరవాత ఓసారి తను దోశ చేసిందని ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పానని అన్నాడు. ఆ తరవాత ఆమె తిని ఓపెన్ చెప్పొచ్చుగా దీనికి కూడా ఎందుకు అంటూ మాట్లాడిందని అన్నాడు. ఆ మరుసటి రోజు ఇడ్లీ చేస్తే బాలేదని చెప్పానని దాంతో మరీ అంత గట్టిగా చెప్పాలంటూ కసురుకుందని అన్నాడు. అంతే కాకుండా సర్ఫెక్సల్ మల్లెపూల సీన్ కూడా రియల్ లైఫ్ లోనిదే అంటూ ఓపెన్ అయ్యాడు.